తలైవా సినిమాల్లోకి వచ్చింది ఈయనవల్లేనట

సూపర్ స్టార్ రజినీకాంత్ సింప్లిసిటీ గురించి, తనకు హెల్ప్ చేసిన వారిపట్ల కృతజ్ఞతగా ఉండడం, తన ఎదుగుదలకు కారణమైన చిన్నచిన్న వ్యక్తులకు తలైవా ఇచ్చే మార్యాద గూర్చి ఎంత చెప్పుకున్న తక్కువే.

  • Written By:
  • Publish Date - October 27, 2021 / 05:00 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ సింప్లిసిటీ గురించి, తనకు హెల్ప్ చేసిన వారిపట్ల కృతజ్ఞతగా ఉండడం, తన ఎదుగుదలకు కారణమైన చిన్నచిన్న వ్యక్తులకు తలైవా ఇచ్చే మార్యాద గూర్చి ఎంత చెప్పుకున్న తక్కువే. సినిమాల్లో ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ పాల్కే అవార్డు అందుకున్న రజినీ తన చిన్నప్పటి విషయాలను, సినిమాల్లోకి వచ్చిన విధానాన్ని గుర్తుచేసుకున్నారు.తనలోని స్టైల్ ని, నటుడిని ముందుగా గుర్తించింది తన స్నేహితుడు బస్సు డ్రైవర్ రాజ్ బహదూర్ అని రజనీ గుర్తు చేసుకున్నారు. తనకివచ్చిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని రాజ్ బహదూర్ కి అంకితం ఇచ్చారు.

76ఏళ్ళ బహాదుర్ బెంగుళూర్ మెట్రో పాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో డ్రైవర్ గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. అవార్డు తీసుకునే సమయంలో తన పేరుని ప్రస్తావించడం రజినికి అవసరం లేదని, ఇది అయన హుందాతనాన్ని, సింప్లిసిటీని తెలుపుతుందని, తనకి సహాయం చేసినవారిని తలైవా మర్చిపోరని బహదూర్ చెప్పుకొచ్చారు. యాభై ఏళ్ల కిందట బహదూర్ డ్రైవర్ గా జాయిన్ అయినప్పుడు రజనీ కండక్టర్ గా జాయిన్ అయ్యారని, అయన స్టయిల్ చూసి సినిమాల్లోకి వెళ్ళమని తానే చెప్పానని బహదూర్ గుర్తుచేసుకున్నారు.

ఎంప్లాయిస్ అసోసియేషన్ కి సంబందించిన వేడుకల్లో రజినీ నాటకాలు వేసేవారని, ఒకరోజు డైరెక్టర్ బాలచందర్ రజినీ నాటకం చూసి తమిళ్ నేర్చుకోమని చెపితే తానే తమిళ్ నేర్పానని బహాదుర్ చెప్పారు.అంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం కొందరికే సాధ్యమయ్యే పనని అలాంటి వారిలో రజినీకాంత్ ముందువరుసలో ఉంటారని బహదూర్ చెప్పి రజినీని కలవడానికి చెన్నై వెళ్లారు.