Site icon HashtagU Telugu

War 2: వార్ 2 లో ఎన్టీఆర్ హీరోయిన్ ఎవరో.. త్వరలో రివీల్!

Ntr

Ntr

War 2: ప్రస్తుతం ఎన్టీఆర్ పలు సినిమాలు చేస్తుండగా అందులో వార్ 2 ఒకటి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చిత్రీకరణ కొంత భాగం పూర్తయింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది త్వరలోనే రివీల్ కానుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వార్ 2లో హీరోయిన్ ఎవర్ని రివీల్ చేయలేదు కానీ త్వరలోనే ఈ సినిమాలో హీరోయిన్ పేరును మేకర్స్ యశ్ రాజ్ ఫిలిమ్స్ ప్రకటించనుంది.

మరి ఈ సినిమాలో ఎన్టీఆర్ తో ఎవరు రొమాన్స్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ఒక్కసారిగా బాలీవుడ్ పెరిగింది. దీంతో యంగ్ టైగర్ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని బాలీవుడ్ నిర్మాతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే వార్ 2 కీలక రోల్ ను ఆఫర్ చేశారు నిర్మాతలు. అయితే ప్రస్తుత సినిమాలు చాలా వరకు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతుండటంతో ఎన్టీఆర్ కూడా ఒకే చెప్పారు.