Site icon HashtagU Telugu

Nicholai Sachdev : వరలక్ష్మీ శరత్‌‌కుమార్‌ కాబోయే భర్త నికోల‌య్ సచ్‌‌దేవ్‌ ఎవరు ?

Nicholai Sachdev

Nicholai Sachdev

Nicholai Sachdev : సౌత్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇటీవలే ముంబై వేదికగా హిందూ సంప్రదాయం ప్రకారం ప్రముఖ గ్యాలరిస్ట్‌ నికోలయ్‌ సచ్‌ దేవ్‌తో వరలక్ష్మి నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది చివర్లో నికోల‌య్- వరలక్ష్మీల వివాహం జరగనుందని సమాచారం. ఇంతకీ నికోలయ్‌ సచ్‌ దేవ్‌ ఎవరు ? అనేది తెలుసుకునేందుకు చాలామంది గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. నికోలయ్‌ సచ్‌ దేవ్‌(Nicholai Sachdev) పేరు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ఆయన బ్యాక్‌గ్రౌండ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

వరలక్ష్మి శరత్ కుమార్ – నికోలయ్ సచ్‌ దేవ్ నిశ్చితార్థం వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకరికొకరు దండలు మార్చుకొని.. ఎంగేజ్మెంట్ ఉంగరాలు మార్చుకొని ఐ లవ్ యూ అని చెప్పుకోడాన్ని మనం చూడొచ్చు. ఈ వీడియోలో శరత్ కుమార్ – రాధిక దంపతులు కూడా సందడి చేశారు. ఇందులో వరలక్ష్మి తన కాబోయే భర్తను లిప్ కిస్ లతో ముంచెత్తడం హైలైట్ గా నిలిచింది.

Also Read : Ram Charan Vs Shah Rukh : అంబానీ ఈవెంట్‌లో రామ్‌ చరణ్‌కు అవమానం.. ఏం జరిగింది ?