Where’s Bollywood? హాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ విలవిల.. కొట్లు కొల్లగొడుతున్న ‘థోర్’

ఇండియన్ సినిమా అంటేనే ప్రతిఒక్కరికీ బాలీవుడ్ మాత్రమే గుర్తుకు వచ్చేది.

  • Written By:
  • Updated On - July 12, 2022 / 12:14 PM IST

ఇండియన్ సినిమా అంటేనే ప్రతిఒక్కరికీ బాలీవుడ్ మాత్రమే గుర్తుకు వచ్చేది. కానీ ఇప్పుడు సౌత్ సినిమాలతోపాటు ఇతర భాషల సినిమాలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. కేజీఎఫ్, ఫుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలతో టాలీవుడ్ సత్తా చాటితే.. బాలీవుడ్ మాత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడిపోయింది. దీంతో సక్సెస్ రేటు కోసం బాలీవుడ్ పడరాని పాట్లు పడుతోంది. సక్సెస్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న బాలీవుడ్ పై హాలీవుడ్ పైచేయి సాధించింది. ఇటీవల విడుదలైన సూపర్‌హీరో చిత్రం ‘థోర్: లవ్ అండ్ థండర్’ విడుదలైన మొదటి నాలుగు రోజుల్లోనే రూ. 64.80 కోట్లు (రూ. 83.61 కోట్లు మైనస్ జిఎస్‌టి) వసూలు చేసింది.

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన అక్షయ్ కుమార్ ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ మూడు ప్రధాన రాష్ట్రాల్లో పన్ను రహితంగా చేసినప్పటికీ, దాని మొత్తం థియేటర్ రన్‌లో రూ. 82.3 కోట్లు వసూలు చేయగలిగింది. ఇండిపెండెంట్ ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ సుమిత్ రియాక్ట్ అవుతూ.. హాలీవుడ్ చిత్రానికి సంబంధించి ‘థోర్’  దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఐదో చిత్రంగా నిలిచిందని అన్నారు. “బాలీవుడ్ నుండి కార్తీక్ ఆర్యన్ నటించిన ‘భూల్ భూలయ్యా 2’ మాత్రమే ప్రారంభ వీకెండ్ లో రూ. 65 కోట్లు వసూలు చేసింది” అని అతను చెప్పాడు. హిట్ మూవీ ‘ది కాశ్మీర్ ఫైల్స్’ కూడా వీకెండ్స్ లో ఓ మోస్తారు వసూళ్లను సాధించింది. కానీ మౌత్ టాక్ కారణంగా ఆ తర్వాత కలెక్షన్లు సాధించింది. ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘భూల్ భులయ్యా 2’ ‘గంగూబాయి కతియావాడి’ లాంటి చిత్రాలే మాత్రమే ఓకే అనిపించుకున్నాయి.