Nag Reaction: విజయ్.. మీ హీరోయిన్ సమంత ఎక్కడ? మాజీ కోడలిని గుర్తు చేసుకున్న నాగార్జున!

టాలీవుడ్ హీరో కింగ్ నాగార్జున తన కోడలి సమంత ను గుర్తు చేసుకున్నారు. అందుకు బిగ్ బాస్ వేదికైంది.

Published By: HashtagU Telugu Desk
Samantha

Samantha

Nag Reaction: నాగ చైతన్య నుండి సమంత విడిపోయి చాలా రోజులు గడిచాయి. అయినప్పటికీ నేటికి సోషల్ మీడియాలో వీళ్లిద్దరి గురించి తరచూ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఖుషి సినిమా ప్రమోషన్ కోసం ‘బిగ్ బాస్ 7 తెలుగు’లో విజయ్ దేవరకొండను చూసిన నాగార్జున తన మాజీ కోడలిని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విజయ్ దేవరకొండ ఇటీవల ‘బిగ్ బాస్ 7’ తెలుగు వేదికపై ఖుషి చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి వచ్చారు. అయితే ఖుషి ప్రమోషన్ కోసం విజయ్ ఒంటరిగా రావడం చూసి బిగ్ బాస్ 7 హోస్ట్ నాగార్జున ‘మాజీ కోడలు’ సమంతను గుర్తు చేసుకున్నారు. ఇందులో నాగార్జున విజయ్ దేవరకొండను సమంత రూత్ ప్రభు గురించి అడిగడం చూడొచ్చు.

‘మీ హీరోయిన్ సమంత ఎక్కడ?’ అని నాగార్జున విజయ్ ని ఈ ప్రశ్న అడిగారు. దీనిపై విజయ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సమంత సినిమా ప్రమోషన్‌తో పాటు మయోసైటిస్‌కు చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లింది అని సమాధానమిచ్చారు. ఇక నాగార్జున విజయ్, సమంతల నటనను ప్రశంసించారు. తెలుగు బిగ్ బాస్ కు నాగార్జున చాలా ఏళ్లుగా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. నాగ చైతన్య సమంతా రూత్ ప్రభుని 2017లో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ పెళ్లికి ముందు కొన్ని సంవత్సరాలు ఒకరితో ఒకరు డేటింగ్ చేశారు, కానీ పెళ్లయిన నాలుగేళ్లకే నాగ, సమంతలకు విభేదాలు వచ్చి 2021 అక్టోబర్‌లో ఇద్దరూ విడిపోయారు.

Also Read: Jacqueline-Sukesh: ఎంత ఘాటు ప్రేమయో, జాక్వెలిన్ కు సుకేష్ బర్త్ డే సర్ ప్రైజ్, 25 కోట్లతో ఆస్పత్రి గిఫ్ట్!

  Last Updated: 04 Sep 2023, 03:20 PM IST