అల్లు అరెస్ట్ అరెస్ట్ రిలీజ్ నేపథ్యంలో జరిగిన పరిణామాలన్నీ కూడా ఇండస్ట్రీని షేక్ చేశాయి. అభిమాని మృతి ఘోర తప్పిందమే అయినా అది యాక్సిడెంటల్ గా జరిగిందే తప్ప కావాలని చేసింది కాదు. ఐతే ఈ కేసులో అల్లు అర్జున్ (Allu Arjun) ని అరెస్ట్ చేసి 12 గంటలు రిమాండ్ లో ఉంచడం పట్ల అటు సినీ ప్రియులతో పాటు సెలబ్రిటీస్ కూడా దీన్ని ఖండిస్తున్నారు.
శనివారం అల్లు అర్జున్ ఇంటికి సినీ పరిశ్రమకు సంబందించిన హీరోలు, దర్శకులు, నిర్మాతలు అందరు వచ్చారు. ఐతే అల్లు అర్జున్ అరెస్ట్ అనగానే చిరంజీవి, నాగ బాబు శుక్రవారం అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. శనివారం మెగా ఫ్యామిలీకి చెందిన వారు ఎవరు కూడా రాలేదు. మెగా యువ హీరోలు వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా సైలెంట్ గా ఉన్నారు.
హైదరాబాద్ వచ్చిన పవన్ కళ్యాణ్..
మరోపక్క పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హైదరాబాద్ వచ్చి అల్లు అర్జున్ ని కలుస్తాడని అనుకోగా అది జరగలేదు. మొన్న ఏపీలో జరిగిన స్వర్ణాంద్ర ప్రోగ్రాం నుంచి డైరెక్ట్ గా హైదరాబాద్ వచ్చిన పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అన్నది తెలియలేదు. పవన్ కళ్యాణ్ తో పాటు చిరంజీవి (Chiranjeevi) కూడా అల్లు అర్జున్ ని కలిసింది లేదు.
మరి అల్లు అర్జున్ ని మళ్లీ మెగా ఫ్యామిలీ అవైడ్ చేస్తుందా లేదా మరే కారణమైనా ఉందా అన్నట్టుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా అల్లు అర్జున్ అరెస్ట్ టైం లో స్టార్ ఫ్యాన్స్, సినీ పరిశ్రమ అంతా కూడా దాన్ని వ్యతిరేకిస్తూ కామెంట్స్ చేయడం విశేషం.
Also Read : Ram Charan Game Changer : గేమ్ చేంజర్ రన్ టైం లాక్..!