Site icon HashtagU Telugu

Thalaivar 170: ఇద్దరు లెజెండ్స్ కలిసిన వేళ.. అమితాబ్ తో రజనీ స్క్రీన్ షేర్

Rajinikanth

Rajinikanth

Thalaivar 170: నిజానికి మల్టీసారర్‌ సినిమాలు ఎప్పుడూ బాగానే ఆడతాయి. మంచి కలెక్షన్లను సాధిస్తాయి. తాజాగా మరో ఇద్దరు లెజెండ్‌ యాక్టర్లు కలిసి ఒక సినిమాలో కనిపించబోతున్నారు. అమితాబ్‌ బచ్చన్, రజనీకాంత్ కాంబినేషన్‌లో త్వరలోనే ఓ సినిమా తెరకెక్కబోతుంది. తలైవా 170వ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ నటించనున్నారని తెలుస్తోంది. అయితే.. ఈ విషయాన్ని స్వయంగా సూపర్‌ స్టార్‌ రజనీకాంతే వెల్లడించారు.

ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక పోస్టు పెట్టారు. దాదాపు 33 ఏళ్ల తర్వాత తన గురువు బిగ్‌బీతో కలిసి నటించబోతున్నట్లు రజనీకాంత్ తన సోషల్‌ మీడియా అకౌంట్ ద్వారా పేర్కొన్నారు. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్‌ చేసుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ప్రస్తుతం రజనీకాంత్‌ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రజనీ, బిగ్‌బీ అభిమానులు ఈ ట్వీట్‌ను లైక్‌లు కొడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఇప్పటి నుంచే ఎంతగానో వెయిట్‌ చేస్తున్నామంటూ చెప్పుతున్నారు. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ 170వ సినిమాకు జైభీమ్‌ ఫేమ్‌ టీజీ జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దసరా విజయన్, రక్షన్‌ సహా తదితరులు నటిస్తున్నట్లు సమాచారం.