Rajinikanth: రజనీకాంత్ ఫేస్ కు లిప్‌స్టిక్ట్ పెయింట్ వేసిన పిక్ ఇప్పుడెందుకు బయటకు వచ్చింది?

జనరల్ గా కెరియర్ కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో.. ఫ్యామిలీకి అంతే ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తులు చాలా రేర్ గా ఉంటారు.

  • Written By:
  • Publish Date - November 6, 2021 / 09:25 AM IST

జనరల్ గా కెరియర్ కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో.. ఫ్యామిలీకి అంతే ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తులు చాలా రేర్ గా ఉంటారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే సూపర్ స్టార్ రజనీకాంత్. రజనీ ఓ ఇంటి వాడయ్యి దాదాపు నాలుగు దశాబ్దాలయింది. అయితే ఈ సందర్భంగా రజనీ,లతల ముద్దుల తనయ ఐశ్వర్య షేర్ చేసిన పిక్ వైరల్ అయ్యింది. ఈ ఫోటోలో రజనీకాంత్ ఫేస్ కు లతా నవ్వుతూ లిప్ స్టిక్ తో కంటి చుట్టూ పెయింట్ వేసినట్లు కనిపిస్తుండగా.. తలైవా కూడా చిరునవ్వులు చిందిస్తున్నారు. దీంతో అభిమానులు తెగ ఖుషీ అయిపోతున్నారు. రజనీకాంత్ ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ ను చూసుకుని మురిసిపోతున్నారు. తమ ఫేవరేజ్ స్టార్ ఆయన వైఫ్ ఎంత అన్యోన్యంగా.. ఉల్లాసంగా ఉండేవారో చెప్పడానికి ఈ ఒక్క పిక్ చాలంటున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్, లత దంపతులకు ఐశ్వర్య , సౌందర్య అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రజనీకాంత్‌తో ఎప్పుడూ అతని భార్య లత లేదా అతని ఇద్దరు కుమార్తెలు ఉంటారు. వీరి కుటుంబం చాలా సన్నిహితంగా ఉంటుంది. ఏ చిన్న అకేషన్ ఉన్నా తాము గడిపిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటారు ఐశ్వర్య. ఫిబ్రవరి 26న, ఐశ్వర్య ధనుష్ రజనీకాంత్ , లతతో కలిసిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పెట్టారు. అలా షేర్ చేసిన ఫోటోలో, లత తన ఎరుపు రంగు లిప్‌స్టిక్‌తో తన భర్త ఫేస్ కు పెయింట్ వేసిన హైలెట్ గా నిలిచింది.

ఐశ్వర్య తన తల్లిదండ్రుల 38వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ పోస్ట్‌ను షేర్ చేసింది. రజనీ, లతను తమ తల్లిదండ్రులుగా కలిగి ఉన్నందుకు తామెంతో అదృష్టం చేసుకున్నామని.. అమ్మా, నాన్నకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అంటూ ఐశ్వర్య ఈ పిక్ ను అప్పుడు పోస్ట్ చేసింది. కానీ ఎందుకో అది ఇప్పుడు వైరల్ గా మారింది.
రజినీకాంత్, లత లవ్ స్టోరీ
రజనీకాంత్ ఫిబ్రవరి 26, 1981న తిరుపతిలో లతను పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లికి ఒక ఏడాది ముందు 1980లో లతను కలిసారు రజనీ. తిల్లు ముల్లు సినిమా షూటింగ్ సమయంలో లతా రంగాచారి ఓ కాలేజీ మ్యాగజైన్‌కి ఇంటర్వ్యూ కోసం రజనీకాంత్‌ను లత మీట్ అయ్యారు. ఇంటర్వ్యూ సమయంలో నే రజనీకాంత్, లత ఇద్దరి అభిరుచులు ఒకేలా ఉన్నాయని తెలుసుకున్నారు. రజనీ బస్ కండక్టర్ గా ఉన్నప్పుడు ఆమె బెంగళూరులోనే ఉన్న విషయాలను షేర్ చేసుకున్నారు. ఆ పరిచయంలోనే రజనీకాంత్ ఆమె వైపు ఆకర్షితుడయ్యారు. ఇంటర్వ్యూ చివరకు వచ్చేసరికి లత ముందు పెళ్లి ప్రపోజల్ పెట్టాడట తలైవా. దానికి వెంటనే ఓకే చెప్పకుండా.. ముందు తన తల్లిదండ్రులతో మాట్లాడాలని లత చెప్పారట. అయితే లత తల్లిదండ్రుల అనుమతి కోసం రజనీకాంత్ తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన చాలామంది సీనియర్ల సహాయం తీసుకున్నారట. చివరికి లత తల్లిదండ్రులు అంగీకరించడంతో 1981లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.