Site icon HashtagU Telugu

Jaya Bachchan: అమితాబ్ పై గాసిప్స్ వచ్చినా.. నేనెన్నడూ ప్రశ్నించలేదు : జయా బచ్చన్

Amitabh Jaya

Amitabh Jaya

బాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ హీరో అమితాబ్ బచ్చన్ .. నేడు (శుక్రవారం) ఆయన పెళ్లి రోజు. సరిగ్గా 49 ఏళ్ల క్రితం జయా బచ్చన్ తో అమితాబ్ పెళ్లి జరిగింది. వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ 25 ఏళ్ల వయస్సులో ఉన్న సమయం అది. అప్పుడప్పుడే ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్యాలెంట్ ను చూపిస్తున్న పరీక్షా కాలం. కట్ చేస్తే.. 1971లో
“గుద్ది” సినిమా షూటింగ్ జరుగుతోంది. అందులో తొలిసారి హీరోయిన్ గా జయా బచ్చన్ నటిస్తోంది. ఆ సినిమా దర్శకుడు హీరో రోల్ కోసం అమితాబ్, ధర్మేంద్ర ఇద్దరిని కెమెరా టెస్ట్ చేశారు. ఈక్రమంలో తొలుత జయా బచ్చన్, అమితాబ్ లతో ఒక టెస్ట్ సీన్ తీశారు. ఈసందర్భంగానే జయ, అమితాబ్ ఒకరికొకరు పరిచయమయ్యారు. చూపులు చూపులు కలిశాయి.

ఈ సినిమాలో హీరో రోల్ ధర్మేంద్ర నే వరించింది. అయినా అమితాబ్ బాధపడలేదు. కానీ జయకు సంబంధించిన వివరాలన్నీ అమితాబ్ కూపీ లాగాడు. ఆ తర్వాత రెండేళ్ల పాటు వీరి మధ్య ప్రేమాయణం నడిచింది. ఈక్రమంలో “జంజీర్” సహా పలు హిట్ సినిమాల్లో ఇద్దరు కలిసి నటించారు. ఎట్టకేలకు1973 జూన్ 3న పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన పాతికేళ్ల తర్వాత.. అంటే 1998లో అమితాబ్, జయ బచ్చన్ లను హీరోయిన్ సిమి గరే వాల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా పై విషయాలను స్వయంగా అమితాబ్ దంపతులే వివరించారు. సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్లపై గాసిప్ వార్తలు రావడం కామన్.

పెళ్లి ఆయిన తర్వాత కూడా అమితాబ్ పై కొన్ని గాసిప్ కాలమ్స్ లో వార్తలు వచ్చాయి. ” ఆ గాసిప్ వార్తలపై మీరెలా స్పందించేవారు ? ” అని జయా బచ్చన్ ను ఇంటర్వ్యూ సందర్భంగా సిమి గరే వాల్ ప్రశ్నించారు. “నేను ఆ గాసిప్ వార్తల గురించి ఎప్పుడూ అమితాబ్ ను ప్రశ్నించలేదు. ఆయనను శంకించలేదు. అలా ఆలోచించడం చాలా చీప్ అవుతుంది” అని జయా బచ్చన్ బదులిచ్చారు.