Site icon HashtagU Telugu

Bappi Lahiri: బప్పి లహరి ‘బంగారం’ కథ!

Bappi1

Bappi1

భారత గాన కోకిల లతా మంగేష్కర్ మరణవార్త మరువకముందే.. దేశం మరో సంగీత దిగ్గజాన్ని కోల్పోయింది. బుధవారం ఉదయం డిస్కో కింగ్ బప్పి లాహిరి మరణ వార్తతో బాలీవుడ్ షాక్ గురైంది. 69 ఏళ్ళ వయసులో గాయకుడు, రచయిత, సంగీత స్వరకర్త ముంబై ఆసుపత్రిలో మరణించారు. బాలీవుడ్ స్టార్స్ నివాళులు అర్పించగా, చాలా మంది అభిమానులు ముంబైలోని ప్రముఖ గాయకుడి నివాసానికి చేరుకున్నారు. బప్పి లాహిరి తన సంగీతానికి ఎంతగానో పేరుగాంచాడు. అతనికి బంగారంపై ఎంత ప్రేమ ఉంది. అతని మెడ చుట్టూ బంగారు గొలుసులు, వజ్రాల ఉంగరాలు, కంకణాలు, ఒక జత సన్ గ్లాసెస్ ఎప్పుడూ ఉంటాయి. ఒకసారి 2009లో హిందుస్థాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బప్పి లాహిరికి బంగారంపై ఉన్న తనకున్న ప్రేమ గురించి బయటపెట్టాడు.

“బంగారం నా అదృష్ట ఆకర్షణ. నేను జఖ్మీని రికార్డ్ చేసినప్పుడు.. మా మమ్మీ నాకు దేవుని పేరు ఉన్న లాకెట్‌తో కూడిన బంగారు గొలుసును ఇచ్చింది. నేను పెళ్లి చేసుకున్నప్పుడు, శ్రీమతి లాహిరి బంగారం చాలా అదృష్టమని చెప్పింది. నా వైవాహిక జీవితం గడిచేకొద్దీ, నా బంగారు గొలుసుల సంఖ్య పెరుగుతూ వచ్చాయి. అవును, నా మెడలోని బంగారు గణపతి నన్ను సురక్షితంగా ఉంచుతుంది. అంతే కాదు.. దివంగత గాయకుడు తన శైలిని మైఖేల్ జాక్సన్ వంటి ఇతర సంగీత దిగ్గజాలతో పోల్చుకున్నాడు “ఈరోజు ఎవరైనా బంగారు గొలుసులు వేసుకుంటే బప్పిలా ఎందుకు కాపీ కొడుతున్నావు అంటున్నారు. కొందరికి మాత్రమే అలాంటి ఇమేజ్ ఉంది. ఎల్విస్ ప్రెస్లీకి గోల్డ్ క్రాస్ ఉంది. మైఖేల్ జాక్సన్ కి సన్ గ్లాసెస్ ఉంది, ఎల్టన్ జాన్ కి టోపీ ఉంది” అని బప్పి లాహిరి చెప్పారు.

ఇక ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలు దర్శకులు కూడా లహరి మెడలో ఉండే నగలతో ఫోటో దిగాలని ఎంత ట్రై చేసినప్పటికీ బప్పిలహరి వారికీ నో చెబుతూ ఉండేవాడు. అంతేకాదు.. ఆయన నగలను ముట్టుకోవడానికి అస్సలు అనుమతి కూడా ఇచ్చేవారు కాదట. బప్పిలహరి స్వయానా కూతురు, కొడుకును కూడా తన బంగారు ఆభరణాలను ముట్టుకోనిచ్చేవారు కాదంట.

Exit mobile version