Jai Bhim : జై భీమ్ వీడియో క్లిప్ లో ఏముంది? ఎందకంతా కంట్రావర్సీ?

తమిళ్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘జైభీమ్’ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా చూసిన ప్రతిఒక్కరూ బాగుంది అంటూ బిగ్ అప్లాజ్ ఇస్తున్నారు.

  • Written By:
  • Publish Date - November 3, 2021 / 03:47 PM IST

తమిళ్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘జైభీమ్’ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా చూసిన ప్రతిఒక్కరూ బాగుంది అంటూ బిగ్ అప్లాజ్ ఇస్తున్నారు. హీరో సూర్య లాయర్ పాత్రలో అద్భుతంగా నటించారని సినీ క్రిటిక్స్ సైతం మెచ్చుకుంటున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హిందీలో మాట్లాడినందుకుగాను ప్రకాష్ రాజ్ క్యారెక్టర్, ఒక వ్యక్తిని చెంపదెబ్బ కొట్టిన వీడియో వివాదానికి దారితీసింది. ఈ సన్నివేశం హిందీ మాట్లాడేవారిని కించపరిచేలా ఉందని కొందరు చెబుతుండగా, మరికొందరు మేకర్స్, నటులను మాత్రం మద్దుతుగా నిలిచారు.

వీడియోలో ఏముందంటే..

‘జై భీమ్’ సమాజంలో బలంగా పేరుకుపోయిన కొన్ని సామాజిక సమస్యలను లేవనెత్తినందుకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వచ్చాయి. ఈ చిత్రంలోని ఓ సన్నివేశం సోషల్ మీడియా వేదికగా హల్‌చల్ చేయడం ప్రారంభించిన తర్వాత ఈ చిత్రం ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. క్లిప్‌లో ప్రకాష్ రాజ్ ‘హిందీలో మాట్లాడటం’ కోసం ఒక వ్యక్తిని చెంపదెబ్బ కొడతాడు. హిందీ బదులు తమిళంలో మాట్లాడమని సీరియస్ అవుతాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్విట్టర్‌లోని ఒక వర్గం వ్యక్తులు ఈ సీన్ చూసి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మూవీ హిందీపై ద్వేషం చిమ్ముతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆయన హిందీలో మాట్లాడినందుకు ఆ వ్యక్తిని చెప్పుతో కొట్టలేదని, హిందీలో మాట్లాడి అయోమయానికి గురిచేశాడని మరికొంతమంది అభిప్రాయపడ్డారు.

నెటిజన్స్ సీరియస్

‘‘జైభీమ్ చూసిన తర్వాత నేను నిజంగా బాధపడ్డాను. ఈ మూవీ ఎవరికీ వ్యతిరేకంగా లేదు. చెడు సంఘటనలు కూడా లేవు. కానీ ఒక వ్యక్తి హిందీ మాట్లాడే సన్నివేశం ఉంది. ప్రకాష్ రాజ్ అతనిని చెంపదెబ్బ కొట్టి తమిళంలో మాట్లాడమని చెప్పాడు. నిజాయితీగా ఈ రకమైన సన్నివేశం అవసరం లేదు. దానిని కట్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అంటూ ఓ నెటిజన్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.