Jr Ntr : ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ తర్వాత ప్లానింగ్ ఏదీ..?

యంగ్ టైగర్ గా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ అండ్ డ్యాన్సర్ గా గుర్తింపూ ఉంది. టాప్ ఫైవ్ హీరోస్ లో ఒకడుగా స్టార్డమూ ఉంది. అయితే ప్రస్తుతం అతని లైనప్ చూస్తుంటే ఈ టాప్ ఫైవ్ నుంచి జారిపోయే ప్రమాదం ఉందనే సంకేతాలు వస్తున్నాయి.

  • Written By:
  • Updated On - December 14, 2021 / 10:14 PM IST

యంగ్ టైగర్ గా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ అండ్ డ్యాన్సర్ గా గుర్తింపూ ఉంది. టాప్ ఫైవ్ హీరోస్ లో ఒకడుగా స్టార్డమూ ఉంది. అయితే ప్రస్తుతం అతని లైనప్ చూస్తుంటే ఈ టాప్ ఫైవ్ నుంచి జారిపోయే ప్రమాదం ఉందనే సంకేతాలు వస్తున్నాయి. అది కేవలం తన ఫ్యూచర్ ప్లానింగ్ లోపం వల్లే అనేది అందరూ చెబుతున్న మాట. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కోసం దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ చేస్తూ బిజిబిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. ఈ మూవీ టీమ్ తో కలిసి ప్రమోషన్ కు వెళ్లిన చోటల్లా తనే హైలెట్ అవుతున్నాడు. అయితే సినిమా విజయం చాలామంది షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా మేజర్ షేర్ రాజమౌళికే వెళుతుంది. తర్వాత రామ్ చరణ్ తో కలిసి మిగిలిన విజయాన్ని ఎన్టీఆర్ పంచుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ మూవీతో సోలోగా అతనికి వచ్చే క్రేజ్ పెద్దదేం కాదు. మరి ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేయబోతోన్న సినిమా ఏంటీ ..? కొరటాల శివతో.

బట్ కొరటాల శివ ఇప్పుడు ప్యాన్ ఇండియన్ మార్కెట్ ను హ్యాండిల్ చేసేంత పెద్ద దర్శకుడు కాదు. పైగా అతని సినిమాలు కేవలం ఒకే పాయింట్ చుట్టూ తిరుగుతుంటాయి. ఇటు చూస్తే ఆచార్య కూడా ఏమంత బజ్ క్రియేట్ చేయలేదు. అందువల్ల కొరటాల శివ సినిమా ఎన్టీఆర్ కు కేవలం తెలుగు మార్కట్ కే పరిమితం అవుతుంది. దఅంటే ఆర్ఆర్ఆర్ వల్ల వచ్చే క్రేజ్ ను కొరటాల పెంచలేడు. కొరటాల తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా ఉంటుంది. ఈ మూవీపై ఎలాగూ అంచనాలు భారీగానే ఉంటాయి. అయితే ఎన్టీఆర్ తో పాటు ఉన్న హీరోల ప్లానింగ్ మాత్రం నెక్ట్స్ లెవెల్లో ఉంది. అల్లు అర్జున్ పుష్పకు ప్యాన్ ఇండియన్ రేంజ్ లో క్రేజ్ ఉంది. తర్వాత దీనికి సీక్వెల్ అంటున్నాడు. అటుపై బోయపాటితో మూవీ కన్ఫార్మ్ అయింది. కుదిరితే వేణు శ్రీరామ్ తో ‘ఐకన్’కూడా ఉంటుంది. ఇవన్నీ ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ గానే వస్తాయి.
రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ తో వచ్చిన క్రేజ్ ను ఆచార్యకు వాడుకుంటాడు. ఒకవేళ ఆచార్య యావరేజ్ అయినా చరణ్ మెయిన్ హీరో కాదు కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు. అదెలా ఉన్నా.. శంకర్ సినిమాతో వాల్డ్ వైడ్ గా ఉన్న ఇండియన్ ఆడియన్సెస్ ను ఆకట్టుకుంటాడు. మహేష్ బాబు ఎలాగూ ప్యాన్ ఇండియన్ ఇమేజ్ పై మోజు లేదనే చెబుతున్నాడు. అయినా సర్కారువారి పాట తర్వాత త్రివిక్రమ్ తో పాటు రాజమౌళి మూవీస్ లైన్ లో ఉన్నాయి. ప్రభాస్ గురించి డిస్కషన్ కూడా అనవసరం. అతను ఆల్రెడీ ఇండియన్ సూపర్ స్టార్స్ లీగ్ లో ఉన్నాడు కాబట్టి.. తెలుగు హీరోలతో కంపేరిజన్ అవసరం లేదు. ఇక పవన్ కళ్యాణ్ లైనప్ గురించి అందరికీ తెలిసిందే.

సో.. వీళ్ల క్రేజీ లైనప్స్ తో చూస్తే ఎన్టీఆర్ చాలా వెనకబడే ఉన్నాడని చెప్పాలి. పైగా కొరటాల సినిమా కథ కూడా ఇంకా ఫైనల్ కాలేదని చాలామందికి తెలియదు. ఇప్పటికే చాలా వెర్షన్స్ మార్చారు. అయినా ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అందుకే కొరటాల శివ ప్రాజెక్ట్ ను పక్కన బెట్టి.. కాస్త ఆలస్యం అయినా.. ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడం ఉత్తమం అని యంగ్ టైగర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా విన్నవించుకుంటున్నారు. మరి వింటున్నావా ఎన్టీఆర్..?