Site icon HashtagU Telugu

Pawan Kalyan: చిరంజీవి వార‌సుడు ఇలా కాకుంటే ఎలా ఉంటాడు: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: రామ్ చ‌ర‌ణ్ హీరోగా డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు జ‌న‌వ‌రి 10న విడుద‌ల కానుంది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రాజ‌మండ్రిలో నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) ఈ ఈవెంట్‌లో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పారు. రామ్ చ‌ర‌ణ్‌ను ఉద్దేశించి చిరంజీవి వార‌సుడు ఇలా కాకుంటే ఎలా ఉంటాడ‌ని ప్రశంస‌లు కురిపించారు.

ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వ‌చ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ.. నేను హీరో అయినా.. రామ్ చరణ్ హీరో అయిన దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారే అని తెలిపారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ చేసే రోజుల్లో సెఫ్టీ సెక్యూరిటీ లేద‌ని తెలిపారు. ఆయ‌న రాత్రి 1 గంట వ‌ర‌కు షూటింగ్ చేసి వ‌స్తే త‌న‌కు సిగ్గుగా ఉండేద‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు. ఆయ‌న కాలికి ఉన్న షూని తొల‌గించి ఎంతో కొంత ఉప‌మ‌శ‌మ‌నం పొందేవాడ్ని అని ప‌వ‌న్ తెలిపారు.

Also Read: Mahindra XUV400: గుడ్ న్యూస్‌.. రూ. 3 లక్ష‌లు త‌గ్గింపు!

రామ్ చ‌ర‌ణ్‌ను చూస్తే ఒక విష‌యంలో అసూయ‌గా ఉంటుంద‌న్నారు. చ‌ర‌ణ్ హార్స్ రైడింగ్ చూస్తే అసూయ వ‌స్తుంద‌ని, మ‌గ‌ధీర టైమ్‌లో చ‌ర‌ణ్ స్కిల్స్ చూసి ఆశ్చ‌ర్యపోయిన‌ట్లు ప‌వ‌న్ తెలిపారు. సంవ‌త్స‌రంలో 365 రోజులు ఉంటే దాంట్లో 100 రోజులు అయ్య‌ప్ప దీక్ష‌, అంజ‌నేయ స్వామి దీక్ష‌లోనే చ‌ర‌ణ్ క‌న‌ప‌డ‌తాడని అన్నారు. చ‌ర‌ణ్ స్టడీ అంతా త‌మిళ‌నాడు, హైద‌రాబాద్‌లో జ‌రిగింద‌ని, కానీ అలాంటి వ్య‌క్తి రంగ‌స్థ‌లంలో ఆంధ్ర కుర్రాడికి న‌టించిన‌ప్పుడు త‌న‌కు జాతీయ అవార్డు వ‌స్తుంద‌నుకున్న అన్నారు. ఈ మూవీతో చ‌ర‌ణ్‌కు జాతీయ అవార్డు రావాల‌ని మ‌నస్ఫూర్తిగా కోరుకుంటున్న‌ట్లు తెలిపారు.

త‌మ‌కు ఏ హీరో అన్న ద్వేషం లేద‌న్నారు. చిరంజీవి గారి అలా మార్గ‌ద‌ర్శ‌క‌త్వం వ‌హించార‌ని పేర్కొన్నారు. ఓజీ సినిన‌మా గురించి ఓజీ సినిమా టైమ్‌లోనే మాట్లాడ‌తాన‌ని స్ప‌ష్టం చేశారు. గ‌బ్బ‌ర్ సింగ్ లో త‌న‌కు హార్స్ రైడింగ్ రాక‌పోయిన ఎలాగోలా మేనేజ్ చేసిన‌ట్లు చెప్పారు. త‌మ్ముడు సినిమా ఎలా గాలి తిరుగుడు తిరిగారో అలానే సినిమాల్లోకి రాక‌ముందే తిరిగిన‌ట్లు ఆయ‌న స్ప‌ష్టం చేశారు. గేమ్ ఛేంజ‌ర్ సినిమాను బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న‌విజ‌యం చేయాల్సింద‌ని అభిమానులే అని అన్నారు. అంతేకాకుండా అభిమానులు క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లాల‌ని ప‌వ‌న్ ప‌దే ప‌దే చెప్పి త‌న స్పీచ్‌ను ముగించారు.