Site icon HashtagU Telugu

Shyam Singha Roy: శ్యామ్ సింగరాయ్ కి ఆ పాయింటే కీలకం

Shyam

Shyam

నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా శ్యామ్ సింగరాయ్. సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటించారు. మడోన్నా సెబాస్టియన్ ఓ కీలక పాత్ర చేసింది. ఇది రెండు కాలాల్లో సాగే కథ అని ముందు నుంచీ చెబుతున్నారు. ఒకటి ఈ కాలంలో సాగేది. మరోటి 1970ల కాలంలో కలకత్తా(అప్పటిపేరు) లో సాగే కథ. అక్కడ జరిగే కథలోని హీరో పేరే శ్యామ్ సింగరాయ్. మనకు ఇలా రెండు కాలాల్లో సాగే కథలు కొత్త కాదు. కానీ ఆ రెండు కథలను ఇంటర్ లింక్ చేయడమే కీలకం. మామూలుగా రెండు జన్మల కథలు చూశాం. అవి హీరో హీరోయిన్లు ఇద్దరూ ఉన్న కథలు. బట్ శ్యామ్ సింగరాయ్ అందుకు భిన్నంగా హీరోనే రెండు కాలాల్లో జన్మించినట్టుగా అర్థమవుతోంది. ఈ మూవీకి సంబంధించి అత్యంత కీలకమైన పాయింట్ కూడా ఇదే. అయితే ఆ పాయింట్ ను ఎలా ప్రెజెంట్ చేశారు అనేదానిపైన సినిమా విజయం ఆధారపడి ఉందనేది అంతా చెబుతోన్న మాట.
మామూలుగా సైన్స్ ఫిక్షన్ కథలైతే ఎలాగైనా చెప్పొచ్చు. రెండు కాలాల్లో సాగే కథకు ఈ ఫిక్షన్ ను జోడించడం ఏమంత కష్టం కూడా కాదు. కానీ చూసే ప్రేక్షకుల అభిరుచి అందులో ప్రతిబింబించాలి. లేదంటే సరికొత్త అనుభూతిని పంచాలి. ఈ రెండు అంశాలను బ్యాలన్స్ చేయడంలోనే దర్శకుడి తెలివి ఉంటుంది.
ఇక శ్యామ్ సింగరాయ్ ట్రైలర్ చూస్తే.. ఇప్పుడు సాగే ఓ పాత్ర షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ.. సినిమా దర్శకుడు కావాలని కలలు కంటూ ఉంటుంది. ఆ క్రమంలోనే జరిగిన ఓ గొడవలో అతని తలపై బలమైన దెబ్బ పడుతుంది. అప్పుడతనికి తనకే సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అవే శ్యామ్ సింగరాయ్ కి సంబంధించినవి. అలా గుర్తొచ్చే అంశాలనే తను కథగా రాసుకుని సినిమా చేయడం అనేది ఫినిషింగ్ గా ఉంటుందని సులువుగానే ఊహించొచ్చు.
అయితే తలకు దెబ్బ తగలగానే గత జన్మ గుర్తుకు రావడం అనేది తెలుగులోనే కాదు.. సినిమాకు సంబంధించి చాలా పురాతనమైన పాయింట్. ఈ పాయింట్ ను పదేపదే ఆలోచించకుండా ప్రేక్షకులను కథనంతో మాయ చేయగలిగితేనే శ్యామ్ సింగరాయ్ సక్సెస్ అవుతాడు. లేదంటే ఒక చిన్న పాయింట్ దగ్గరే ఆగిపోతాడు. సినిమా విజయానికి అదే శాపం కూడా అవుతుంది. మరి వీళ్లు ఈ శాపాన్ని తప్పించుకని మంచి సినిమానే అందించి ఉంటారని ఆశిద్దాం.

Exit mobile version