Site icon HashtagU Telugu

Srimanthudu: శ్రీమంతుడు విషయంలో అసలేం జరిగింది?

Srimanthudu

Srimanthudu

Srimanthudu: మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన శ్రీమంతుడు 2015లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్ర కథ విషయంలో కొద్దీ రోజులుగా అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి ఈ అంశం కోర్టు మెట్లెక్కింది. ఈ కథ తనదే అని.. స్వాతి పత్రికలో ప్రచురించిన కథ ఆధారంగా కాపీ చేశారని రచయిత శరత్ చంద్ర కోర్టుకెక్కారు. దీంతో రచయితల సంఘంతో పాటు హైకోర్టు కూడా కొరటాల శివ కాపీ చేశారని తేల్చేశాయి. దీంతో కొరటాల సుప్రీం కోర్టుకెక్కారు. ఈ కేసు పరిశీలించిన సుప్రీం కోర్టు స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్వర్వుల ప్రకారం క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందేనని సుప్రీం తెలిపింది. ఇప్పటివరకు ఇది జరిగింది.

ఈ పిటిషన్ మమ్మల్ని డిస్మిస్ చేయమంటారా..? లేక మీరే వెనక్కి తీసుకుంటారా..? అని లాయర్ నిరంజన్ రెడ్డిని సుప్రీం కోర్టు ప్రశ్నించగా, తామే పిటిషన్ ను వెనక్కి తీసుకుంటామని చెప్పగా దీనికి న్యాయస్థానం అంగీకరించింది. దీంతో శ్రీమంతుడు సినిమా కథ కాపీ కొట్టి తీసిన సినిమాగా నిర్థారణ అయ్యింది. ఇక మిగిలింది క్రిమినల్ కోర్టులో విచారణ ఆనంతరం శిక్ష పడటమే మిగిలింది. శరత్ చంద్ర రాసిన చచ్చేంత ప్రేమ అనే కథ గతంలో స్వాతి పత్రికలో రావడం జరిగింది. అప్పట్లో ఉత్తమ కథగా కూడా ఎంపిక అయ్యింది. ఆ కథను సినిమాగా తీయాలని కథా రచయిత నిర్మాతను సంప్రదించడం అడ్వాన్స్ ఇవ్వడం కూడా జరిగిందట.

అయితే.. ఇంతలో తన కథను కాపీ కొట్టి కొరటాల శ్రీమంతుడు అనే సినిమా చేయడం జరిగింది. మొత్తానికి శ్రీమంతుడు కాపీ కథ అని క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం కొరటాల టైమ్ ఏమీ బాలేదు. అందుకనే ఆచార్య తర్వాత ఎంతో కష్టపడితే.. ఎన్టీఆర్ తో పాన్ ఇండియా మూవీ దేవర చేసే ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయాలి అనుకున్నారు. అయితే.. ఓ వైపు ఎన్నికలు వస్తుండడం.. మరో వైపు సైఫ్ ఆలీఖాన్ గాయం వలన షూటింగ్ కి బ్రేక్ పడడం జరిగింది. దీంతో దేవర రిలీజ్ వాయిదా పడింది. ఇలాంటి టైమ్ లో కొరటాల శ్రీమంతుడు కథ కాపీ కొట్టారని క్లారిటీ వచ్చింది. మరి.. ఈ కష్టకాలం నుంచి కొరటాల ఎలా బయటపడతారో.. ఈ వివాదం ఎంత వరకు వెళుతుందో.

Also Read: Green Mirchi : పచ్చిమిర్చి కారంగా ఉంటుందని పక్కన పెడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

Exit mobile version