Taraka Ratna: నందమూరి తారకరత్న కన్నుమూత.. గుండెల్లో బ్లాక్స్ కారణం

జనవరి 27న నారా లోకేష్‌ ప్రారంభించిన పాదయాత్రలో తారకరత్న (Taraka Ratna) పాల్గొన్నారు. ఉదయం 11.20 నిమిషాలకు లక్ష్మీపురం మసీదులో నారా నారా లోకేష్ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న తారకరత్న జనం మధ్యలో ఉండడంతో ఒత్తిడికి గురై కుప్పకూలిపోయారు.

Published By: HashtagU Telugu Desk
Tarakaratna

Tarakaratna

జనవరి 27న నారా లోకేష్‌ ప్రారంభించిన పాదయాత్రలో తారకరత్న (Taraka Ratna) పాల్గొన్నారు. ఉదయం 11.20 నిమిషాలకు లక్ష్మీపురం మసీదులో నారా నారా లోకేష్ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న తారకరత్న జనం మధ్యలో ఉండడంతో ఒత్తిడికి గురై కుప్పకూలిపోయారు. మధ్యాహ్నం 12.00 గంటలకు కుప్పం పట్టణంలోని కె.సి ఆస్పత్రికి తారకరత్నను తరలించారు. అక్కడ సి.పి.ఆర్ చేసిన డాక్టర్ మంజునాథ్‌ పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఆస్పత్రికి చేరుకున్న బాలకృష్ణ డాక్టర్ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత కె.సి ఆస్పత్రి నుంచి కుప్పంలోని పి.ఈ.ఎస్ మెడికల్ కాలేజికి తారకరత్నను తరలించారు. హార్ట్ వాల్వ్‌లో 98 శాతం బ్లాక్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడంతో స్టంట్ వేయడానికి ఇబ్బంది ఏర్పడింది. అదేరోజు సాయంత్రానికి బెంగళూరు నుంచి నారాయణ హృదయాలయ నుంచి ప్రత్యేక వైద్య బృందం వచ్చింది. అర్దరాత్రి 12 గంటలకు కుప్పం నుంచి బెంగళూరు నారాయణ హృదయాలయకు తారకరత్నను తరలించారు. జనవరి 28న తొలిసారిగా నారాయణ హృదయాలయ నుంచి హెల్త్ బులిటిన్ విడుదల విడుదల చేశారు. అప్పటి నుంచి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. చివరికి శనివారం మృతి చెందినట్టు ప్రకటించారు

సినిమా ఎంట్రీ ఓ రికార్డు

సినిమా మొదలు కాకుండానే వరల్డ్ రికార్డు క్రియేట్ చేసాడు తారక రత్న. అదేలాగంటే.. ఏకంగా ఈయన తొమ్మిది సినిమాలు..ఒకే రోజు ఓపెనింగ్ జరుపుకున్నాయి.ఇది ఓ ప్రపంచరికార్డు.ఇప్పటికీ ఈ ఘనత బద్దలు కాకపోవటం విశేషం. అయితే ఈ తొమ్మిది సినిమాలలో కేవలం ఐదు చిత్రాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఈయన మొదటి సినిమా ఒకటో నంబర్ కుర్రాడు. ఈ కుర్రాడు బాగానే ఉన్నాడు అనిపించాడు. ఫైట్స్,డాన్స్,నటనతో కనికట్టు చేసాడు. సినిమా పాటలు బిగ్ హిట్ కొట్టాయి.తారకరత్న అనే నేమ్ ఆంధ్రదేశం అంతటా వినిపించింది. చాలా మంది హీరోలు మొదటి సినిమాతో మెప్పించలేకపోయారు. ఫెయిల్యూర్స్‌ను అందుకున్నారు. తర్వాత సినిమాలతో నిరూపించుకున్నారు.అలాగే తారక రత్న కూడా ప్రయత్నాలు చేస్తూ వెళ్లాడు. యువ రత్న మూవీతో మెప్పించాడు.

హీరోగా విజయం కలసి రాలేకపోయినప్పుడు, తారక రత్న నిరాశపడలేదు. హీరోగానే కంటిన్యూ అవుతాను అని ఫిక్స్ అయిపోలేదు. నటుడిగా సత్తా చూపించాలి అనుకున్నాడు.అందుకే అమరావతి సినిమాలో విలన్ పాత్రలో కనిపించి అబ్బురపరిచాడు.అమరావతి చిత్రం.. తారక రత్నలోని అసలు సిసలు నటుడ్ని బయటికి తెచ్చింది.హీరోగా నటించి మెప్పించడం ఒక ఛాలెంజ్. విలన్ గా నటించి మెస్మరైజ్ చేయడం అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ స్వీకరించి అమరావతిలో నటనకు బెస్ట్ విలన్‌గా నంది అవార్డు అందుకున్నాడు.విలన్‌గా సత్తా చూపించిన తారకరత్న, తర్వాత కూడా నటుడిగా విలక్షణమైన పాత్రలలో కనిపించడం అలవాటుగా చేసుకున్నాడు.వెబ్ సిరీస్లో సైతం తారక్ రత్న ప్రవేశించాడు. నైన్ హవర్స్ అనే వెబ్ సిరీస్లో నటించాడు.

క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ సిరీస్లో సిఐ క్యారెక్టర్లో మెప్పించాడు. మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడుహీరో ప్రయత్నాలతో పాటు..విలన్పాత్రలలో ఒకే సారి నటించటం తక్కువగా జరుగుతుంది. తారక రత్న ఇటు కథానాయకుడిగా,అటు ప్రతినాయకుడిగా రెండు రోల్స్ను విజయవంతంగా పోషించాడు .ఎప్పటికప్పుడు ..నటుడిగా ప్ర్రూవ్ చేసుకోవాలనే తాపత్రయం అతనిలో కనిపించేదివెంకటాద్రి,ముక్కంటి,నందీశ్వరుడు లాంటి సినిమాలలో హీరోగా నటిస్తునే,రాజ చేయి వేస్తే లాంటి మూవీలలో నెగెటివ్ రోల్ చేసి భయపెట్టాడు. తాను నటుడిగా నిలబడేందుకు, ప్రేక్షకులను మెప్పించేందుకు, తనదగ్గరికి వచ్చిన ప్రతీ అవకాశాన్ని వంద శాతం వినియోగించుకున్నాడు. అందుకోసం ట్రెండ్ తగ్గట్లు మారాడు.వెండితెర పై స్టార్ డమ్ అందిరానప్పటికీ, తనదైన వ్యక్తిత్వంతో నందమూరి కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ వచ్చాడు. సౌమ్యడిగా ఉంటూ..వివాహరహితుడిగా మెలిగాడు. నందమూరి కుటుంబంలో అందరికి ఆప్తుడిగా పెరిగాడు.

  Last Updated: 18 Feb 2023, 11:06 PM IST