Site icon HashtagU Telugu

Prabhas Pic: ప్రభాస్ ఏంటీ ఇలా మారిపోయాడు, నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఫొటో!

Prabhas

Prabhas

‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాలలో అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. తన నటనతో పాన్ ఇండియా హీరో అనే ట్యాగ్ ను సొంతం చేసుకున్నాడు. అయితే ఇటీవల ప్రభాస్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. గతంలో మరుగుజ్జుగా చీత్రికరించిన ట్రోలర్స్ తాజాగా ప్రభాస్ ను బట్టతల ఉన్న వ్యక్తిగా మార్చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ప్రభాస్ అభిమానులు షాక్ అయ్యారు. ఆ తర్వాత ఫేక్ అని తేలడంతో ఊపిరిపీల్చుకున్నారు.

ప్రభాస్ వ్యతిరేక వర్గం ఈ ఫొటోను వైరల్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ ఇచ్చాడు. మొదట, ‘రాధే శ్యామ్’ రూ. 170 కోట్ల నష్టాలను చవిచూసింది, ఆ తర్వాత ‘ఆదిపురుష్’ కూడా అదే అదే ఫలితాన్ని చవిచూసింది. ఆదిపురుష్  కు ఏకంగా రూ. 225 కోట్ల నష్టాలు వచ్చాయని ట్రేడ్ వర్గాల అంచనా.

ఇన్ని పరాజయాలు ఎదురైనప్పటికీ, ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా చెప్పబడుతున్న ‘కల్కి 2898 AD’లో నటిస్తున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ తో తెరకెక్కుతోంది. దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్ ఈ మూవీలో నటిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ తో సలార్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ త్వరలో విడుదల కాబోతుంది.

Also Read: Delhi Woman Guard Rape : మహిళ సెక్యూరిటీ గార్డ్‌ ఫై అత్యాచారం

Exit mobile version