What happened : అనసూయకు ఏమైంది..?

వివాదాలకు దూరం అవ్వడమే కాదు .. వేసుకునే బట్టల్లోను మార్పు కనిపిస్తుంది

Published By: HashtagU Telugu Desk
What happened to Anasuya..?

What happened to Anasuya..?

అనసూయ..ఈ పేరు చెప్పిన..విన్న కానీ యూత్ లో కొంటె కోరికలు పుట్టుకొస్తాయి. ఇద్దరు పిల్లలకు తల్లైన కానీ హీరోయిన్ రేంజ్ గ్లామర్ అమ్మడి సొంతం. అందుకే అమ్మడికి యూత్ దగ్గరి నుండి పెద్దవారి వరకు అభిమానులు ఉన్నారు. అప్పుడెప్పుడో యాంకర్ గా అడుగుపెట్టి..ఆ తర్వాత జబర్దస్త్ షో (Jabardasth Show) తో తన జతకమే మార్చుకోవడమే కాదు బుల్లితెర యాంకర్లు ఇలా కూడా ఉంటారా అనిపించేలా చేసింది.

చీర కట్టులోనైనా , మోడ్రన్ డ్రెస్సులో నైనా అమ్మడి తర్వాతే ఎవరైనా అనేలా తన అందంతో కట్టిపడేయడం ఆమెకు చెల్లింది. కేవలం బుల్లితెర ఫై మాత్రమే కాదు వెండితెర ఫై రంగమ్మత్త గా పవర్ ఫుల్ రోల్ చేసి వెండితెర ప్రేక్షకులను కూడా అలరించింది. అంతేనా సోషల్ మీడియా (Social Media) లో అయితే అమ్మడి గురించి ఎంత చెప్పిన తక్కువే..నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్స్ , బికినీ షూట్స్ తో రచ్చ రచ్చ చేసింది. ఇక వివాదాల్లో కూడా అమ్మడు తక్కువేం కాదు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ విషయంలో అమ్మడు మరింత వైరల్ అయ్యింది. అలాంటి అను..ఇప్పుడు బాగా మారిపోయింది. అభిమానులు కూడా ఆమెను చూసి..నిజంగా అనసూయనేనా..? అని షాక్ అవుతున్నారు.

వివాదాలకు దూరం అవ్వడమే కాదు .. వేసుకునే బట్టల్లోను మార్పు కనిపిస్తుంది. మొన్నటి వరకు బికినీ లలో , హాట్ చీర కట్టులో కనిపించిన అను..ఇప్పుడు పద్ధతైన చీరలు , డ్రెస్సులు వేసుకుంటూ ఆశ్చర్య పరుస్తుంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఓ ఫోటోను షేర్ చేసింది. గుడ్ ఫుడ్ ఇజ్ ఏ గుడ్ మూడ్ అంటూ… ఓ ఫోటో షేర్ చేసింది. ఇందులో చిన్నారులు.. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు. వారి కోసం మంచి ఆరోగ్య ఆహారాన్ని అనసూయ (Anasuya) తయారు చేసింది. బ్రెడ్, డ్రై ఫ్రూట్స్, అరటిపండ్లతో పాటు పలు రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. దీనికి థ్యాంక్స్ ఐ మెడ్ ఇట్ అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. అంతే కాదు తనలో వచ్చిన మార్పులను గురించి కూడా చెప్పుకొచ్చింది. ‘మైండ్ సెట్ మారిపోయింది. నా ప్రాధాన్యతలు మారాయి. నా అభిరుచులు మారాయి. నా సహనం పెరిగింది..’ అంటూ తనలోని మార్పులు గురించి తెలిపింది. ఇదంతా చూసిన ఫాలోయర్స్ , అభిమానులు , నెటిజన్లు అబ్బా అను అంటూ కామెంట్స్ వేస్తున్నారు. మరి ఇంత మార్పు సడెన్ గా ఎందుకో..? తెలియాలి.

ఇక సినిమాల విషయానికి వస్తే..ఈ ఏడాది ‘మైఖేల్’, ‘రంగమార్తాండ’, ‘విమానం’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ‘పుష్ప 2’ తో పాటు పలు చిత్రాల్లో నటిస్తోంది.

Read Also: Magadheera : మగధీరలో ఆ ఐకానిక్ సీన్.. రాజమౌళి ఆ సినిమాలో నుంచి కాపీ చేశాడట..

  Last Updated: 29 Jul 2023, 10:05 PM IST