Bhagya Sri టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న మరో హీరోయిన్ భాగ్య శ్రీ బోర్స్. మాస్ మహరాజ్ రవితేజ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో భాగ్య శ్రీ నటించడం ఆమె అదృష్టంగా భావిస్తుంది. ఐతే అమ్మడు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ ఆఫర్ ఎలా వచ్చింది అన్నది చెప్పుకొచ్చింది. ముంబైలో చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ మీద ఆసక్తితో మోడల్ గా మారాను. ముందు కెమెరా అంటే కాస్త భయం అనిపించినా తర్వాత అలవాటైంది.
అలా మోడల్ గా చేస్తున్న టైంలో కొన్ని కమర్షియల్స్ వచ్చాయి. ఇప్పుడు సినిమా ఛాన్సులు వస్తున్నాయని చెప్పింది. మిస్టర్ బచ్చన్ కోసం ఆడిషన్ ఇచ్చా డైరెక్టర్ కి నచ్చి తీసుకున్నారు. రవితేజ, హరీష్ శంకర్ లాంటి వారితో పరిచయం అవ్వడం లక్కీగా ఫీల్ అవుతున్నా అన్నారు. ఇక ఫ్రీ టైం లో తను డాన్స్ చేస్తా అంటుంది భాగ్య శ్రీ. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టమని చెబుతూ ఖాళీ సమయం దొరికితే చాలు డాన్స్ చేస్తూ ఉంటానని అంటుంది అమ్మడు.
ఇక మిస్టర్ బచ్చన్ (Mr Bachchan) రిలీజ్ కు ముందే ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని. ఇలా నా తొలి సినిమాకే జరుగుతుందని ఊహించలేదని అంటుంది భాగ్య శ్రీ. మిస్టర్ బచ్చన్ లో అమ్మడి డాన్స్ మూమెంట్స్ అన్ని ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ సినిమా హిట్ పడితే మాత్రం టాలీవుడ్ కి మరో స్టార్ హీరోయిన్ వచ్చేసినట్టే అని చెప్పుకోవచ్చు.
మిస్టర్ బచ్చన్ రిలీజ్ అవ్వకుండానే భాగ్య శ్రీకి విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి సినిమా ఆఫర్ వచ్చింది. మిస్టర్ బచ్చన్ సినిమా సక్సెస్ అయితే వీడీ సినిమాపై అమ్మడికి డబుల్ క్రేజ్ వస్తుంది.
Also Read : Rashmika : రష్మిక డెడికేషన్ సూపర్..!