Site icon HashtagU Telugu

Allu Arjun : ఫ్యాన్స్ ముసుగులో తప్పుడు పోస్టులు.. చర్యలు తీసుకుంటాం : అల్లు అర్జున్

Allu Arjun Fake Ids Fake Profiles

Allu Arjun :  తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై హీరో అల్లు అర్జున్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఫ్యాన్స్ ముసుగులో కొందరు తప్పుడు సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అలాంటి వారికి దూరంగా ఉండాలని తన అభిమానులకు సూచించారు. ఈమేరకు అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.

Also Read :Amazon Prime Membership : ‘అమెజాన్ ప్రైమ్’ వాడుతున్నారా ? పాస్‌వర్డ్ షేరింగ్ రూల్స్‌ మారుతున్నాయ్

‘‘నా ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపర్చాలి. ఎవరినీ వ్యక్తిగతంగా కించపర్చేలా పోస్టులు షేర్ చేయొద్దని నా విన్నపం. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ఐడీలు, ఫేక్ ప్రొఫైల్స్‌తో పోస్టులు షేర్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. నెగెటివ్ పోస్టులు షేర్ చేస్తున్న వారికి నా అభిమానులు దూరంగా ఉండాలి’’ అని అల్లు అర్జున్(Allu Arjun) కోరారు.

అల్లు అర్జున్ , మోహన్ బాబు ఘటనలపై తెలంగాణ డీజీపీ జితేందర్ ఇవాళ మీడియా ఎదుట స్పందించారు. తాము అల్లు అర్జున్‌కు వ్యతిరేకం కాదని తేల్చి చెప్పారు. చట్టప్రకారమే ఆయనపై యాక్షన్ తీసుకున్నామని స్పష్టం చేశారు. సంధ్య థియేటర్ సంఘటన దురదృష్టకరమని డీజీపీ పేర్కొన్నారు. ‘‘నటుడు మోహన్ బాబు  కేసు నమోదు చేశాం. మోహన్ బాబుది ఫ్యామిలీ వివాదం. మీడియా ప్రతినిధిపై దాడి చేసినందు వల్లే చట్టం ప్రకారం మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాల్సి వచ్చింది’’ అని డీజీపీ వివరించారు. ఇక సంధ్య థియేటర్ ఘటనపై శనివారం రోజు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ తో పాటు సినీ ఇండస్ట్రీ తీరుపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత తనపై, తెలంగాణ ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు రావడాన్ని రేవంత్ ఖండించారు. ఈవిషయంలో కొంత మందిపై కేసులు కూడా నమోదయ్యాయి. సీఎం వ్యాఖ్యలు చేసిన వెంటనే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు. ‘‘సంధ్య థియేటర్ ఘటన యాక్సిడెంట్.. అందులో ఎవరినీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు.