Darling Prabhas: ఆదిపురుష్ కోసం యుద్దం చేశాం: ప్రిరిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్

ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చరిత్రలో వెన్నడో లేని విధంగా జరిగింది.

  • Written By:
  • Updated On - June 7, 2023 / 12:19 AM IST

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చరిత్రలో వెన్నడో లేని విధంగా జరిగింది. ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామిజీ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకకు వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ కాషాయ దుస్తులు ధరించి సందడి చేశారు. ఈ ప్రిరిలీజ్ వేడుకలో ప్రభాస్ తెల్లని దుస్తులు ధరించి ఆకట్టుకున్నారు. స్టేజీ పైకి రాగానే విల్లును ఎక్కుపెట్టి అభిమానులను ఫిదా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమా కోసం యుద్దం చేశామని, ఆదిపురుష్ సినిమా కాదనీ, ఒక ఎమోషన్ అని అన్నారు. డైరెక్టర్ ఓంరౌత్ ఓ సైనికుడిలా పనిచేశారని, ఆయన నా సూపర్ హీరో అని కొనియాడారు. జానకి పాత్రలో క్రుతి సనన్ అద్భుతంగా నటించిందని, ఆమెను తప్ప మరే హీరోయిన్ ను ఊహించుకోలేం అని అన్నారు. హనుమంతుడి పాత్రలో నటించిన దేవ్ జీతో నాకు ఎమోషన్ ఏర్పడిందని అన్నారు. అభిమానుల కోసమే ఈసినిమా చేశానని, ఇక నుంచి తక్కువ మాట్లాడుతూ ఎక్కువ సినిమాలు చేస్తానని అభిమానులకు మాట ఇచ్చారు ప్రభాస్.

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఈ ఆది పురుష్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా కృతి సనన్ సీత పాత్రలో నటించింది. దేవదత్త నాగే ఇంకా సన్నీ సింగ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. అలాగే రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించారు.

మన రామాయణ కథనే సరికొత్తగా తెరకెక్కించి ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు టీమ్. ఇక ఈ సినిమాని సుమారు 550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో టి సిరీస్ సంస్థ నిర్మించగా ఈ సినిమాకు ఓం రౌత్ సహ నిర్మాతగా వున్నాడు. ఇంకా అలాగే రెట్రో ఫైల్స్ అనే సంస్థ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం అయింది. అయితే నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ గ్రాఫిక్స్ వర్క్ మీద ట్రోలింగ్ జరిగిన నేపథ్యంలో మళ్లీ గ్రాఫిక్స్ వర్క్ అంతా కూడా చేయించడంతో సినిమా రిలీజ్ లేట్ అయింది. ఇక ఎట్టకేలకు జూన్ 16వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇంకా హిందీ భాషలతో పాటుగానే పలు విదేశీ భాషల్లో కూడా సినిమాని రిలీజ్ చేస్తున్నారు.