Site icon HashtagU Telugu

Star Couple : మేము కలిసే ఉన్నాం…ప్లీజ్ మమ్మల్ని విడగొట్టకండి..!!

Sneha

Sneha

ఒక్కప్పటి టాప్ హీరోయిన్లలో స్నేహ ఒకరు. ఆకట్టుకునే అందంతో అచ్చం తెలుగింటి అమ్మాయిలా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మకు సినీఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులు ఉన్నారు. చక్కటి రూపంతో తెలుగు, తమిళ అభిమానులను బాగా ఆకట్టుకుంది ఈ బ్యూటీ. టాలీవుడ్ లో స్నేహ నటించిన హనుమాన్ జంక్షన్, వెంకీ, సంక్రాంతి, ప్రియమైననీకు వంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

తమిళ నటుడు ప్రసన్న కుమార్ ను ప్రేమ వివాహం చేసుకుంది స్నేహ. వీరికి పాప, బాబు ఉన్నారు. వీరి సంసారం చక్కగా సాగుతోంది. ఈ సమయంలో ఈ జంటపై రూమర్స్ కొన్ని వైరల్ గా మారాయి. వీరిద్దరు విడిపోతున్నారన్న వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. వీరు ప్రస్తుతం వేరువేరుగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక…స్నేహ వరకు చేరకుండా ఉంటుంది. ఈ విషయం కాస్త స్నేహ చెవిలో పడింది. దీంతో సీరియస్ గా స్పందించింది స్నేహ. మేము విడిపోలేదు. కలిసే ఉంటున్నాం. దయచేసి మమ్మల్ని విడగొట్టకండి. అంటూ అందరి నోళ్లు మూయించింది.

Exit mobile version