The India House: హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ది ఇండియా హౌస్ (The India House) షూటింగ్ సమయంలో హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్‌లో జూన్ 11న భారీ ప్రమాదం జరిగింది. సముద్ర సన్నివేశాల కోసం ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ అకస్మాత్తుగా పగిలిపోవడంతో సెట్ మొత్తం నీటితో మునిగిపోయింది. ఈ ఘటనలో అసిస్టెంట్ కెమెరామెన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మరికొంతమంది సిబ్బందికి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. గాయపడినవారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ప్రమాదం కారణంగా సెట్‌లోని కెమెరాలు, లైటింగ్ సామగ్రి, ఇతర సామగ్రి దెబ్బతినడంతో చిత్ర యూనిట్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రమాద సమయంలో నిఖిల్ సెట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి ముందు షాట్ బ్రేక్‌లో హీరో నిఖిల్ పక్కకు వెళ్లినట్లు సమాచారం. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో అసిస్టెంట్ కెమెరామెన్‌కు కాళ్లు విరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే హీరో నిఖిల్ క్షేమంగా ఉన్నట్లు నిర్మాతలు ప్రకటించారు. షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేయగా, భద్రతా చర్యలపై చిత్ర బృందం దృష్టి సారించింది.
Also Read: Honeymoon Murder: హనీమూన్ హత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు!
We r all Safe 🙏🏽
Sometimes in our Quest to give the Best cinematic Experience we take Risks. Today we survived a Huge mishap thanks to the Alert Crew and Precautions taken.
We lost Expensive Equipment but by gods grace there was no human damage 🙏🏽 #IndiaHouse https://t.co/uhrHjOUtFx— Nikhil Siddhartha (@actor_Nikhil) June 12, 2025
ది ఇండియా హౌస్ చిత్రాన్ని రామ్ చరణ్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తుండగా, రామ్ వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. నిఖిల్ సరసన సాయి మంజ్రేకర్ నటిస్తుండగా, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. 1905 నాటి స్వాతంత్య్ర సమర నేపథ్యంలో రాజకీయ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ ప్రమాదం షూటింగ్ షెడ్యూల్‌పై ప్రభావం చూపినప్పటికీ.. త్వరలో చిత్రీకరణ పునఃప్రారంభమవుతుందని భావిస్తున్నారు. నిఖిల్.. కార్తికేయ 2 వంటి విజయంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాడు.
హీరో నిఖిల్ స్పందన
తాజాగా ఈ ఘటనపై హీరో నిఖిల్ ఎక్స్ వేదికగా స్పందించారు. తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని వెల్లడించారు. ఈరోజు మేము ఒక పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాం. మేము ఖరీదైన పరికరాలను కోల్పోయాం. కానీ దేవుడి దయ వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అని ట్వీట్ చేశారు.