Site icon HashtagU Telugu

Vijay Deverakonda: మెట్లపై నుంచి జారిపడ్డ విజయ్‌ దేవరకొండ.. వీడియో వైర‌ల్‌!

Vijay Devarakonda Movie Updates by Producer Naga Vamsy

Vijay Devarakonda Movie Updates by Producer Naga Vamsy

Vijay Deverakonda: టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కు మ‌రో ప్రమాదం జరిగింది. ఆయన ప్రస్తుతం ఓ ఈవెంట్‌లో ప్రమోషన్స్‌ కోసం ముంబై వెళ్లాడు. ప్రమోషన్స్‌ అనంతరం బయటకు వస్తోన్న సమయంలో ప్రమాదవశాత్తు మెట్లపై జారిపడ్డారు. అయితే ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే విజ‌య్ దేవ‌ర‌కొండ ఇటీవ‌ల షూటింగ్‌లో కూడా గాయ‌ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే అక్క‌డ ఉన్న ఆయ‌న అభిమానులు ద‌య‌చేసి వీడియో తీయొద్దు అని చేతుల‌తో అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. అయినా కొంద‌రూ ఆక‌తాయిలు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆయ‌న అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రౌడీ హీరోకు ఎటువంటి గాయాలు కాక‌పోవ‌డంతో ఫ్యాన్స్ సైతం ఊపిర పీల్చుకున్నారు.

ఇక‌పోతే రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఇటీవ‌ల స‌రైన హిట్ అందుకోలేక‌పోయారు. ఆయ‌న చివ‌రి చిత్రం ఫ్యామిలీ స్టార్ కూడా ఆశించిన స్థాయిలో ఆడ‌క‌పోవ‌డంతో ఫ్యాన్స్ సైతం నిరాశ చెందారు. ఫ్యామిలీ స్టార్ కంటే ముందు వ‌చ్చిన చిత్రం ఖుషీ యావ‌రేజ్‌గా నిలిచింది. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌రకొండ గౌత‌మ్ తిన్న‌నూరితో త‌న 12వ చిత్రంలో న‌టిస్తున్నాడు. ఇక‌పోతే ముంబైలో ‘సాహిబా’ ప్రమోషన్స్ కోసం వెళ్లినప్పుడు విజ‌య్ జారిప‌డిన‌ట్లు కొన్ని క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.

Also Read: Sharmila Demand: ష‌ర్మిల కొత్త డిమాండ్‌.. జ‌గ‌న్ ఆ ప‌ని చేయ‌కుంటే రాజీనామా చేయాల్సిందే?

విజయ్ దేవరకొండ ప్ర‌స్తుతం జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక భారీ బడ్జెట్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా సితార టర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో వ‌స్తుంది. ఈ మూవీ 2025 మార్చి 28న విడుదల కానుంది. ఇటీవ‌ల మూవీ విడుద‌ల‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను చిత్ర‌బృందం విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. విజ‌య్ దేవ‌ర‌కొండ త‌దుప‌రి ప‌లు సినిమాల‌కు సైన్ చేసిన‌ట్లు తెలుస్తోంది.