Chiranjeevi’s swag: చిరంజీవి.. రామ్ చరణ్.. ఇద్దరూ ఇద్దరే..!

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాండింగ్ గురుంచి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.

  • Written By:
  • Updated On - November 13, 2022 / 11:31 PM IST

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాండింగ్ గురుంచి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అభిమానులు ఈ ఇద్దరిని స్క్రీన్‌పై, ఆఫ్ స్క్రీన్ లో చూడటానికి ఇష్టపడతారు. తాజాగా మెగాస్టార్ ముంబైకి వెళ్ళినప్పుడు తనదైన ముద్ర వేశారు. నీలిరంగు టీ షర్ట్, నలుపు ప్యాంటు ధరించి స్టైలిష్ రిస్ట్ వాచ్‌లో అందంగా కనిపించారు. మెగాస్టార్ తన కారు వద్దకు వెళ్లి బయలుదేరుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.

తాజాగా నటుడు, చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ కూడా ఢిల్లీలో సాధారణ తెల్లటి టీ- షర్టు, గ్రే కలర్ ప్యాంట్‌లో స్పోర్ట్స్ షూస్, గ్రూవీ సన్ గ్లాసెస్‌తో తన క్యాజువల్ లుక్ లో ఆదరగొట్టాడు. తమ డ్రెస్సింగ్ స్టైల్ తో ఎలా ఫోకస్ అవ్వాలో తండ్రి, కొడుకులకు బాగా తెలుసని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

మెగాస్టార్.. దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్ లో భోళా శంకర్‌ మూవీ తెరకెక్కుతుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్ 14 ఏప్రిల్ 2023న సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ మూవీలో చిరంజీవి సరసన తమన్నా భాటియా, మెగాస్టార్ సోదరిగా నటి కీర్తి సురేష్ కనిపించనున్నారు. దీంతో పాటు దర్శకుడు బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య మూవీలో కూడా చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. ఈ మూవీలో మెగాస్టార్ తో పాటు మరో హీరో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

మరోవైపు.. రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు ఎస్. శంకర్ డైరెక్షన్ లో ఆర్‌సి 15 మూవీతో బిజీగా ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఈ రాబోయే సస్పెన్స్ డ్రామా స్క్రిప్ట్‌ను చిత్రనిర్మాత కార్తీక్ సుబ్బరాజు రాశారు. పాటలను ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్. థమన్ స్వరపరచనున్నారు.