Jr Ntr: ఎన్టీఆర్ పై వార్2 ఎఫెక్ట్.. స్పీడ్ తగ్గిన ‘దేవర’ షూటింగ్

దేవర" షూటింగ్‌ను డిసెంబర్ నాటికి ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఎన్టీఆర్

Published By: HashtagU Telugu Desk
Ntr Devara Next Level Plann

Ntr Devara Next Level Plann

Jr Ntr: జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ మొదట “దేవర” షూటింగ్‌ను డిసెంబర్ నాటికి ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలనుకున్నాడు కూడా. దీంతో చిత్రీకరణ కూడా శరవేగంగా జరుగుతోంది. అయితే ఇటీవల కొంత స్పీడ్ తగ్గింది. ఎన్టీఆర్ ఇటీవలే అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన తన మొదటి హిందీ చిత్రం “వార్ 2” కు సంతకం చేశాడు.

మొదట్లో చిత్రనిర్మాతలు జనవరి 2024లో షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నారు. అప్పటికి ఎన్టీఆర్ అందుబాటులోకి వస్తారని భావించారు. దీంతో “దేవర” మూవీ నిర్మాణం వేగవంతమైంది కూడా. అయితే సల్మాన్ ఖాన్ “టైగర్ 3” బాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో నిర్మాత ఆదిత్య చోప్రా “వార్ 2” షూటింగ్ త్వరగా ఫినిష్ చేసి విడుదల చేయలని ఫిక్స్ అయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వడంతో  ఫలితంగా దేవర షూటింగ్ ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఎలా ముందుకువెళ్తాడో చూడాల్సిందే మరి.

Also Read: Hyderabad: పైపులైన్ లీకేజ్ ఎఫెక్ట్, రేపు హైదరాబాద్ లో తాగునీరు బంద్

  Last Updated: 12 Dec 2023, 12:06 PM IST