Site icon HashtagU Telugu

WAR 2 Trailer : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. ఆకట్టుకుంటున్న ట్రైలర్

War 2

War 2

WAR 2 Trailer : జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ వార్-2పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో ఈ సినిమా హైప్ మరింత పెరిగిపోయింది. బాలీవుడ్ , టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకే తెరపై పోటీపడుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యష్ రాజ్ ఫిలిమ్స్ అత్యధిక బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న వార్-2 ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద పెద్ద కలెక్షన్లు రాబట్టేలా కనిపిస్తోంది.

ట్రైలర్‌లో చూపించిన యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో డిజైన్ చేసినట్టు కనిపిస్తున్నాయి. మొదటి పార్ట్ వార్లో యాక్షన్ ఎంతగానో ఆకట్టుకున్నా, ఈ సారి ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ల మధ్య పోరాట సన్నివేశాలు మరో స్థాయిలో వున్నాయి. కార్ చేజ్‌లు, బైక్ యాక్షన్, భారీ ఎక్స్‌ప్లోషన్‌లతో ట్రైలర్ క్షణాల్లోనే ప్రేక్షకుల అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా ఎన్టీఆర్, హృతిక్ ఎదురెదురుగా తలపడే సన్నివేశాలు గూస్‌బంప్స్ తెప్పించేలా వున్నాయి.

Sravana Masam 2025 : ఈరోజు నుంచి శ్రావణమాసం స్టార్ట్.. నాన్ వెజ్ ఎందుకు తినకూడదో తెలుసా..?

జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్, స్టైలిష్ రోల్‌లో కనిపించనున్నాడు. టాలీవుడ్‌లో ఎన్టీఆర్‌కు ఉన్న భారీ ఫ్యాన్‌బేస్ ఈ సినిమాను పాన్ ఇండియా హిట్‌గా మార్చేందుకు ముందంజలో ఉంది. ఎన్టీఆర్, హృతిక్ కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు రెండు ఇండస్ట్రీల అభిమానులను సమానంగా ఆకట్టుకుంటాయని ట్రైలర్ స్పష్టంగా చెప్పేస్తోంది.

ఆగస్టు 14న సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ కూడా రిలీజ్ అవుతోంది. దీని వల్ల బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ తప్పదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అయినా సరే, ఎన్టీఆర్ సౌత్‌లో ఉన్న ఇమేజ్, హృతిక్ రోషన్ బాలీవుడ్‌లో కలిగిన క్రేజ్ కలిసి వార్-2కు మాస్ , క్లాస్ ఆడియెన్స్‌ను సమానంగా ఆకర్షించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

యష్ రాజ్ ఫిలిమ్స్ గతంలో వార్, పఠాన్, టైగర్ వంటి సినిమాలతో భారీ విజయాలు సాధించింది. అదే తరహా ప్రమాణాలతో వార్-2ను రూపొందిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మేకర్స్ ఇప్పటికే రిలీజ్‌కు ముందు నుంచే భారీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ట్రైలర్‌తో పాటు రాబోయే టీజర్లు, పాటలు సినిమాపై మరింత హైప్ సృష్టించనున్నాయి.

Ola S1 Sales: ఈ కంపెనీ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ వ‌ద్దంటున్న క‌స్ట‌మ‌ర్లు.. ఎందుకంటే?