Site icon HashtagU Telugu

Shahrukhs House : బాలీవుడ్ బాద్‌షా ఇంట్లో ఉండే ఛాన్స్ .. రెంట్ ఎంతో తెలుసా ?

Shahrukhs House

Shahrukhs House :  బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌కు ముంబైలోనే కాదు అమెరికా, లండన్, దుబాయ్ సహా పలు చోట్ల విలువైన బంగళాలు ఉన్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం లాస్ ఏంజెల్స్‌ కౌంటీలోని బెవర్లీ హిల్స్ సిటీలో  షారుఖ్‌కు సువిశాలమైన మ్యాన్షన్ ఉంది.  ఆయనకు ఉన్న ఇతర బంగ్లాల కంటే ఇది చాలా పెద్దదీ.  2017 సంవత్సరంలోనే దీన్ని షారుఖ్ కొన్నారు. అమెరికాకు వెళ్లిన ప్రతిసారి షారుఖ్(Shahrukhs House) ఈ మాన్షన్ లోనే ఉంటారు. దీంట్లో ఆరు పెద్ద బెడ్ రూమ్స్ ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join

అమెరికాకు వెళ్లినప్పుడు షారుఖ్ దంపతులు, వారి పిల్లలు సుహానా ఖాన్, ఆర్యన్ ఖాన్, అబ్రహం ఖాన్‌ ఈ రూమ్స్‌లోనే ఉంటారు. ఈ ఇంట్లో స్విమింగ్ పూల్, టెన్నిస్ కోర్టు, ప్రైవేట్ కాబానాస్ ఉన్నాయి. ఈ భవంతి తెలుపు, లేత గోధుమ రంగుతో బ్యూటిఫుల్‌గా ఉంది. ఈ మ్యాన్షన్ శాంటా మోనికా, రోడియో డ్రైవ్, వెస్ట్ హాలీవుడ్‌కు చాలా దగ్గర్లో ఉంది. ఇంతకీ ఇప్పుడు కొత్త అప్‌డేట్ ఏముంది అని ఆలోచిస్తున్నారా ? మనకు షారుఖ్ ఖాన్ బెవర్లీ హిల్స్ ఇంట్లో గడిపే అవకాశం లభించనుంది. అయితే ఇందుకోసం కొంత మొత్తం చెల్లించాలి. ఒక రాత్రికి ఎంత పే చేయాలి తెలుసా ? దాదాపు రూ. 2 లక్షలు. ఇలా తన ఇంటిని రెంటుకు ఇచ్చేందుకు Airbnb అనే కంపెనీతో షారుఖ్ ఖాన్ చేతులు కలిపారు. అద్దెకు ఉండాలని భావించే వారి కోసం బెవర్లీ హిల్స్‌లోని తన ఇంట్లో దిగిన కొన్ని స్టైలిష్ ఫొటోలను షారుఖ్ ఖాన్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పోస్ట్ చేశారు.  ఈ ఫొటోలను బట్టి ఆ మ్యాన్షన్‌లో రిసార్టుకు మించిన పచ్చదనం, ప్రకృతి రమణీయత ఉన్నాయి. చూడటానికి అది ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తోంది.

Also Read :Donations : ‘అన్నా క్యాంటీన్ల’‌‌కు సామాన్యుల విరాళం.. టీడీపీ సర్కారుకు ప్రజా చేయూత

షారుఖ్ ఖాన్‌కు ముంబైలోనూ లగ్జరీ ఇల్లు ఉంది. దాని పేరు ‘మన్నత్’. ఈ ఇంటి వ్యాల్యూ దాదాపు రూ.20 కోట్లకుపైనే ఉంటుంది.షారుఖ్ ఖాన్ చివరగా ‘డుంకీ’ సినిమాలో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది. గత ఏడాది ఆయన నటించిన ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించాయి. ఈ సినిమాలు ఒక్కొక్కటి రూ. 1000 కోట్లకు పైనే కలెక్షన్స్ సాధించాయి.

Also Read :Space Debris Hit Home : ఇంటిపై పడిన అంతరిక్ష శిథిలం.. భారీ పరిహారం కోసం నాసాపై కేసు