Site icon HashtagU Telugu

Surekhavani : నాకు అలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి.. సురేఖా వాణి కామెంట్స్ వైరల్?

Mixcollage 15 Feb 2024 08 24 Am 2714

Mixcollage 15 Feb 2024 08 24 Am 2714

తెలుగు సినీ ప్రేక్షకులకు నటీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది సురేఖ వాణి. నటిగా లేడీ కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో సినిమాల్లో వదినగా, తల్లిగా, అక్క పాత్రలలో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది సురేఖా. సహాయ నటిగా సురేఖ వాణి చాలా సినిమాల్లో నటించింది. ఇప్పటికీ నటిస్తూనే ఉంది సురేఖ వాణి. ముఖ్యంగా బ్రహ్మనందం లాంటీ కమెడీయన్స్ తో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో సురేఖ వాణి చేసే రచ్చ గురించి మనందరికీ తెలిసిందే.

తన కూతురు సుప్రీతాతో కలిసి ఈ వయసులో కూడా అందాలను ఆరబోస్తూ గ్లామర్ ఫోటో షూట్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు డాన్స్ వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పటి కప్పుడు తన అందాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఇది ఇలా అలా ఉంటే సురేఖావాణి, తన కూతురు సుప్రీతతో కలిసి ఒక యూట్యూబ్‌ ఇంటర్వూలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె పలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

సుప్రీత మాట్లాడుతూ.. నాకోక బాయ్ ఫ్రెండ్ కావాలి అంటే.. నాక్కూడా ఓ బాయ్ ఫ్రెండ్ కావాలన్నారు సురేఖా వాణి. అంతేకాదు మంచి మనస్సు ఉన్న వ్యక్తి అయ్యి ఉండి.. హైట్ అండ్ నైస్ ఫిజిక్ ఉండాలని అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా సురేఖ క్రేజీ కామెంట్స్ పై నెటిజన్స్ అభిమానులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.

Exit mobile version