Site icon HashtagU Telugu

Waltair Veerayya Collections: వీరయ్య దెబ్బకు బాక్సాఫీస్ బద్దలు.. 3 రోజుల్లో 108 కోట్లు!

Waltair

Waltair

టాలీవుడ్ (Tollywood) బాక్సాఫీస్ ను ప్రభావితం చేయడంలో మెగా హీరోలు ఒక అడుగు ముందే ఉంటారు. సినిమా సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు కొల్లగొడుతుంటారు. మూవీకి కాస్తా పాజిటివ్ టాక్ వస్తే చాలు.. ఇక కాసులు రాలాల్సిందే. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజ రవితేజ కలిసి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే 100 కోట్లు సాధించింది.

ఇక సంక్రాంతి రోజున వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) సినిమా బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా కంటే ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ పెంచుకుంటూ వెళ్ళింది. యూఎస్ లో కూడా ఊహించని స్థాయిలో కలెక్షన్స్ రాబడం విశేషం. ప్రీమియర్స్ ద్వారానే 682 860 డాలర్స్ అందుకోవడం విశేషం. ఇక మొదటి రోజు యూఎస్ లో 308911 డాలర్స్ రెండవ రోజు 392532 డాలర్స్ మూడవరోజు 310 220 డాలర్స్ ను సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో 47.46 కోట్ల షేర్ కలెక్షన్స్ 76.80 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇక కర్ణాటక అలాగే రెస్టాఫ్ ఇండియాలో ఈ సినిమాకు 3.90 కోట్లు షేర్ రాగా మొత్తంగా ఓవర్సీస్ లో అయితే 7.55 కోట్లు వచ్చాయి.

ఇక ప్రపంచవ్యాప్తంగా వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) 60 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ 108 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం. సంక్రాంతి రోజు అయితే వాల్తేరు వీరయ్యకు బాగా కలిసి వచ్చింది. లాభల్లోకి రావాలి అంటే ఈ సినిమా ఇంకా 27 కోట్లకు పైగా షేర్ అందుకోవాల్సి ఉంది. వాల్తేరు వీరయ్యతో పాటు విడుదలైన వారసుడు, కళ్యాణం కమనీయం సినిమాలు ప్రేక్షకులను నిరాశపర్చడం చిరంజీవి (Chiranjeevi) సినిమాకు బాగా కలిసి వచ్చింది. ఇప్పట్లో పెద్ద సినిమాలేవీ విడుదల లేకపోవడంతో వాల్తేరు వీరయ్య మరిన్ని కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది.

Also Read: Avatar And RRR: టాలీవుడ్ క్రేజ్.. అవతార్ డైరెక్టర్ తో ‘ఆర్ఆర్ఆర్’ డైరెక్టర్!