Site icon HashtagU Telugu

Vyuham : చివరి నిమిషంలో వ్యూహం రిలీజ్ కు బ్రేక్..ఈసారి మాత్రం లోకేష్ కాదట..

Vyuham Release Postponed

Vyuham Release Postponed

వర్మ (Varma) తెరకెక్కించిన వ్యూహాం (Vyuham) మూవీ రిలీజ్ (Release) కు మరోసారి బ్రేక్ (Break) పడింది. మొన్నటివరకు కోర్ట్ ఉత్తర్వులతో వాయిదా పడగా..ఇక ఇప్పుడు అంత సెట్ అయ్యింది..రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అంత అనుకుంటున్న తరుణంలో మరో ఎదురుదెబ్బ ఎదురైంది. సాంకేతిక కారణాలతో సినిమా వాయిదా పడింది. ఈ విషయాన్నీ డైరెక్టర్ వర్మ తెలియజేసాడు. కేవలం వ్యూహం మాత్రమే కాదు శపథం మూవీ కూడా వాయిదా పడినట్లు తెలిపారు. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల మార్చి 1న వ్యూహం.. మార్చి 8న శపథం విడుదల చేస్తున్నట్లు వర్మ ప్రకటించారు. ఈ సారి కారణం లోకేష్‌ (Nara Lokesh) కాదని వర్మ తనదైన శైలి లో సెటైర్ వేశారు. రేపు ఏకంగా 9 సినిమాలు విడుదల కానున్నడంతో ‘వ్యూహం’ సినిమాకు అనుకున్నన్ని థియేటర్‌లు దొరకడం కష్టం కావడంతో వాయిదా వేసినట్లు క్లారిటీ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

రామధూత క్రియేషన్స్‌ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్‌ నిర్మించిన ఈ చిత్రాల్లో అజ్మల్, మానస ముఖ్య పాత్రలు పోషించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు, ఇప్పటి ఏపీ సీఎం జగన్ ఎదుర్కొన్న పరిస్థితుల ఆధారంగా ‘వ్యూహం’ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను నవంబర్‌లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. తర్వాత డిసెంబర్ 29వ తేదీకి వాయిదా వేశారు. ఇదే క్రమంలో ‘వ్యూహం’ సినిమా తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని, ఈ మూవీ సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేసి, విడుదలను నిలిపేయాలని నారా లోకేష్ హైకోర్టులో పిటీషన్ వేయడం తో రిలీజ్ కు బ్రేక్ పడింది. తర్వాత కోర్ట్ నుండి గ్రీన్ సిగ్నల్ రావడం తో రేపు( ఫిబ్రవరి 23 న) ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని అనుకున్నారు కానీ థియేటర్స్ దొరకక వాయిదా వేశారు. వచ్చే నెలైన రిలీజ్ అవుతుందో లేదో..చూడాలి.

Read Also : Medaram : మేడారం జాతరలో విషాదం..ఇద్దరు భక్తులు మృతి