వివాదాలకు కేరాఫ్ గా నిలిచే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) నుండి వస్తున్న చిత్రం వ్యూహం (Vyuham ). జగన్ కు సపోర్ట్ గా ఈ చిత్రాన్ని వర్మ తెరకెక్కిస్తుండగా, దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ , పలు స్టిల్స్ రాజకీయాల్లో సంచలనం రేపగా…ఈరోజు టీజర్ ను రిలీజ్ చేసి ఆసక్తి నింపారు. గత ఎన్నికల సమయంలో వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించగా అది సంచలనం రేపింది. ఇక ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో వ్యూహం చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత నుంచి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు చోటుచేసుకున్న పరిణామాలను వర్మ తన కోణంలో చూపించబోతున్నాడు.
వ్యూహం టీజర్ (Vyuham Teaser)విషయానికి వస్తే. ‘నిజం షూ లేస్ కట్టుకునేలోపే అబద్ధం ప్రపంచమంతా ఓ రౌండేసి వస్తుంది” అనే డైలాగ్‌తో మొదలవుతుంది. రాజకీయ నేతలు వేసే వ్యూహాలను, ప్రతి వ్యూహాలను నాయకులను టీజర్ లో చూపించారు. అలాగే జగన్ జైల్ సీన్లను, అక్కడ జరిగే ఎమోషనల్ సన్నివేశాలను సినిమాలో హైలెట్ చేసి చూపించబోతున్నట్లు టీజర్ చూస్తే అర్ధం అవుతుంది.
అలాగే ఈ టీజర్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి, అల్లు అరవింద్, సోనియా గాంధీ, రోశయ్య, మన్మోహన్ సింగ్, నాగబాబు ఇలా అనేకమంది పాత్రలని చూపించాడు. మరి ఈ సినిమా రాజకీయంగా ఏపీలో ఎన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి. టీజర్ చివర్లో ఏదో ఒక రోజు కళ్యాణ్ ను కూడా వెన్ను పోటు పొడుస్తారు కదా అని చంద్రబాబు పాత్రని అడగ్గా వాడికి అంత సీన్ లేదు.. వాడిని వాడే వెన్ను పోటు పొడుచుకుంటాడు అనే డైలాగ్ టీజర్ కే హైలైట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్.. విజయవాడ, గుంటూరు పరిసరాల్లో శరవేగంగా సాగుతోంది.
Read Also : Srisailam Sikharam: శ్రీశైలంలో ఎలుగుబంటిల కలకలం, భయాందోళనలో భక్తులు