రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) నుండి వస్తున్న వివాదస్పద చిత్రం వ్యూహం (Vyooham ). వైస్సార్ (YSR) మరణం తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఇప్పటీకే ఈ చిత్ర ట్రైలర్ , పోస్టర్స్ , సినిమా తాలూకా విశేషాలు సినిమా ఫై ఆసక్తి పెంచగా..రేపు ‘వ్యూహం జనగర్జన’ పేరిట విజయవాడ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపబోతున్నారు. ఈ ఈవెంట్ కు చంద్రబాబు, పవన్, లోకేష్ లను ట్విట్టర్ వేదికగా రామ్ గోపాల్ వర్మ ఆహ్వానం పలకడం మరింత క్రేజీ గా మారింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లను రాంగోపాల్ వర్మ, చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. అనంతరం వర్మ మాట్లాడుతూ..సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వైసీపీ నాయకులు ఎమ్మేల్యేలు వస్తారని తెలిపారు. వ్యూహం రాజకీయ వ్యూహం కోసం తీయలేదని, వేరే వాళ్ళ మీద వ్యూహం తీసాం కానీ మా మీద మాకు వ్యూహం లేదన్నారు. చంద్రబాబు అరెస్ట్, వివేకా హత్య వంటి సన్నివేశాలు ఇందులో ఉంటాయన్నారు. అలాగే ఈ మూవీ లో చంద్రబాబు, పవన్, చిరంజీవి , షర్మిల, సోనియా, రాహుల్ పాత్రలు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. 2009 నుంచి 2019 ఎన్నికల వరకు జగన్ కు సంబందించిన అన్ని ఘట్టాలు ఇందులో చూపించినట్లు చెప్పుకొచ్చారు. ఇక జనవరి నెలలో వ్యూహం కి కొనసాగింపు గా “శపథం ” రిలీజ్ చేస్తున్నామన్నారు.
ఇదిలా ఉంటె ఈ మూవీ ఫై తెలంగాణ హైకోర్టు లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిటిషన్ దాఖలు చేసారు. ఈ మూవీకి ఇచ్చిన సెన్సార్ ను రద్దు చేయాలనీ పిటిషన్ లో కోరారు. ఈ చిత్రాన్ని విడుదల కాకుండా చూడాలని పేర్కొన్నారు. మరి ఈ పిటిషన్ ఫై హైకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.