Site icon HashtagU Telugu

VV Vinayak : డైరెక్టర్ వినాయక్ కు లివర్ సర్జరీ…?

Vv Vinayak Liver Surgery

Vv Vinayak Liver Surgery

మాస్ డైరెక్టర్ వినాయక్ (VV Vinayak) కు మేజర్ సర్జరీ జరిగిందనే వార్త అభిమానుల్లో టెన్షన్ పెడుతుంది. వినాయక్ అంటే తెలియని సినీ లవర్స్ ఉండరు. మాస్ చిత్రాలను తెరకెక్కించడం లో వినాయక్ దిట్ట. చిరంజీవి , ఎన్టీఆర్ , రవితేజ , ప్రభాస్, అల్లు అర్జున్ , చరణ్ వంటి అగ్ర హీరోలతో సినిమాలు చేసి తన మార్క్ చూపించారు. కాగా గత కొంతకాలంగా సినిమాలు చేయడం తగ్గించిన ఈయన..ఆ మధ్య ఛత్రపతి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి ఘోర ప్లాప్ ను మూటకట్టుకున్నాడు. ఆ తర్వాత ఎలాంటి సినిమా ప్రకటన చేయలేదు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో మొన్నామధ్య బాగా చిక్కిపోయినట్లుగా ఉన్న ఆయన లుక్ బాగా వైరల్ అయ్యింది. వినయ్‌కి ఏమైంది, ఏమైనా అనారోగ్య సమస్యా అంటూ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. తాజాగా ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీవీ వినాయక్‌కి మేజర్ లివర్ సర్జరీ జరిగిందని.. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌ ఎల్‌బీ నగర్‌లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. ఈ వార్తలపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.

Read Also : Chiru-Balayya : ఒకే ఫ్రేమ్ లో చిరు , బాలయ్య..ఫ్యాన్స్ కు ఇంతకన్నా పెద్ద పండగ ఉంటుందా..?