Site icon HashtagU Telugu

VV Vinayak : వీవీ వినాయక్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన టీం.. చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం అంటూ హెచ్చరిక..

Vv Vinayak Team gives Clarity on his Health

Vv Vinayak

VV Vinayak : ఒకప్పుడు దిల్, ఠాగూర్, ఆది, చెన్నకేశవరెడ్డి, బన్నీ, అదుర్స్.. లాంటి ఎన్నో సూపర్ హాట్ సినిమాలు తీసిన వీవీ వినాయక్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. చివరగా బెల్లంకొండ శ్రీనివాస్ తో హిందీలో ఛత్రపతి సినిమాని రీమేక్ చేయగా అది ఫ్లాప్ అయింది. ఆ సినిమా వచ్చి రెండేళ్లు అవుతుంది. మళ్ళీ ఇప్పటివరకు వీవీ వినాయక్ నుంచి ఎలాంటి సినిమా రాలేదు.

కొన్ని నెలల క్రితం వీవీ వినాయక్ అనారోగ్యానికి గురయి కోలుకున్నారు. ప్రస్తుతం బాగానే ఉన్నారు. తాజాగా నిన్న దిల్ రాజు, సుకుమార్ మరి కొంతమంది సినీ ప్రముఖులు వీవీ వినాయక్ ని వాళ్ళ ఇంటికి వెళ్లి మరీ కలిశారు. దీంతో మళ్ళీ వీవీ వినాయక్ అనారోగ్యానికి గురయ్యారంటూ, అందుకే వీళ్లంతా పరామర్శించడానికి వెళ్లారని పలు వార్తలు వచ్చాయి. వీవీ వినాయక్ ఆరోగ్యం పై పలువురు తప్పుడు వార్తలు ప్రచారం చేశారు.

దీంతో వీవీ వినాయక్ టీం ఈ తప్పుడు వార్తలపై స్పందించింది. ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్ గారి ఆరోగ్యంపై కొన్ని మాధ్యమాలలో వస్తున్న వార్తలు అవాస్తవం. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా వున్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకుండా వాస్తవాలు తెలుసుకొని ప్రచురించాలి అని మనవి. ఇకపై ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకొనబడును అంటూ తెలిపారు. మళ్ళీ వీవీ వినాయక్ తన స్టైల్ మాస్ సినిమాతో ఎప్పుడు కంబ్యాక్ ఇస్తారో చూడాలి.

Also Read : The Paradise Glimpse : నాని ‘ది పారడైజ్’ గ్లింప్స్ వచ్చేసింది.. కడుపు మండిన కాకుల కథ..