Site icon HashtagU Telugu

VV Vinayak : ఎన్టీఆర్‌తో లవ్ స్టోరీ చేయాల్సింది.. కానీ కొడాలి నాని వద్దన్నాడు..

Vv Vinayak shares Interesting Facts about Kodali Nani and NTR

Vv Vinayak shares Interesting Facts about Kodali Nani and NTR

జూనియర్ ఎన్టీఆర్(NTR), వివి వినాయక్(VV Vinayak) కాంబినేషన్ లో మొత్తం మూడు సినిమాలు వచ్చాయి. మొదటి సినిమా ‘ఆది’తోనే మాస్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. ‘ఆది’ చిత్రంతోనే వినాయక్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తరువాత సాంబ, అదుర్స్ సినిమాలతో కూడా ఆడియన్స్ ని బాగా అలరించారు. ఈ మూడు చిత్రాలు మాస్ కథాంశంతో ఆడియన్స్ ముందుకు వచ్చాయి. అయితే వినాయక్ ‘ఆది’ కంటే ముందు ఎన్టీఆర్ కి మరో కథ వినిపించాడట. ఆది ఒక లవ్ స్టోరీ అని ఒక సందర్భంలో వినాయక్ తెలియజేశాడు.

ఆ ప్రేమ కథలో హీరోయిన్ పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందట. ఈ కథ వినిపించడానికి వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ తప్పించుకోలేక.. ‘సరే త్వరగా కథ చెప్పు. నాకు సమయంలో లేదు’ అని చెప్పాడట. దీంతో వినాయక్ ఐదు నిమిషాల్లో హీరో ఇంట్రడక్షన్‌ సీన్‌ చెప్పాడట. అది విన్న ఎన్టీఆర్ బాగా నచ్చడంతో.. రెండు గంటలు కేటాయించి మొత్తం కథ విన్నాడట. స్టోరీ బాగా నచ్చడంతో ఎన్టీఆర్ కథ పై ఆసక్తి చూపించాడట. కానీ అప్పుడే కొడాలి నాని ఎంట్రీ ఇచ్చాడు. ఎన్టీఆర్, కొడాలి నాని(Kodali Nani) మంచి మిత్రులు అని అందరికి తెలిసిందే. కొడాలి నాని నిర్మాతగా ఎన్టీఆర్ తో సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.

ఆ డైరెక్టర్‌తో మనకెందుకు. ప్రేమకథలు మనకి వద్దని చెప్పు, నీకు మాస్ హీరోగా సక్సెస్ లు వస్తున్నాయి ఇప్పుడు.. అని కొడాలి నాని ఎన్టీఆర్ తో చెప్పాడట. ఈ విషయాన్ని ఎన్టీఆర్, వినాయక్ కి చెప్పలేక, ఆ సినిమా చేయలేక, కొన్నాళ్ళు వినాయక్ ని ఫేస్ చేయలేక చాలా ఇబ్బంది పడ్డాడట. అయితే కొంత కాలం తరువాత వినాయక్ మళ్ళీ సమయం అడిగి ‘ఆది’ కథ చెప్పాడు. ఆది మాస్ కథ కావడంతో అందరి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ముందుగా చెప్పిన ప్రేమ కథ రాసుకోవడానికి ఏళ్ళ తరబడి కష్టబడిన వినాయక్.. ఆది స్క్రిప్ట్ ని కేవలం రెండు రోజుల్లోనే పూర్తి చేశాడట. ఈ విషయాలను వినాయక్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఒకవేళ కొడాలి నాని ఒప్పుకుంటే ఎన్టీఆర్ తో ఇంకో ప్రేమకథ సినిమా తీసేవాడ్ని అని తెలిపారు వినాయక్.