VK Naresh : మహేష్ మీద ఈగ వాలనివ్వను.. బ్రదర్ గా నేనెప్పుడూ తోడుంటా..!

VK Naresh మహేష్ మీద అతని ఫ్యామిలీ మీద ఈగ వాలనివ్వను అంటున్నారు సీనియర్ యాక్టర్ వీకే నరేష్. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన విజయ నిర్మల మృతిచెందిన తర్వాత కృష్ణ గారు

Published By: HashtagU Telugu Desk
Senior Hero Naresh Wifes and Childrens details

Senior Hero Naresh Wifes and Childrens details

VK Naresh మహేష్ మీద అతని ఫ్యామిలీ మీద ఈగ వాలనివ్వను అంటున్నారు సీనియర్ యాక్టర్ వీకే నరేష్. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన విజయ నిర్మల మృతిచెందిన తర్వాత కృష్ణ గారు బాధపడతారని మేమంతా చాలా సైలెంట్ గా ఉన్నాం కానీ కృష్ణ గారిని కోల్పోవడం మేమంతా కూడా ఎంతో బాధపడ్డాం.

We’re now on WhatsApp : Click to Join

ఆ టైం లో మహేష్ ఎలా ఫీల్ అయ్యాడో ఈమధ్య జరిగిన గుంటూరు కారం ఈవెంట్ లో చూశారు. మహేష్ అలా మాట్లాడటం ఎప్పుడు చూడలేదు. మొదటిసారి అభిమానులతో తన బాధని వెల్లగక్కాడని అన్నారు నరేష్.

అంతేకాదు చిన్నప్పుడు మేమంతా కలిసిమెలిసి ఉన్నాం. విజయ నిర్మల, కృష్ణ గారు వెళ్లిపోయాక ఎవరి లైఫ్ వారిది అయ్యింది. అయితే పెద్ద వాడిగా ఫ్యామిలీ అందరికీ నేనున్నాను. వాళ్ల మీద ఈగ కూడా వాలనివ్వకుండా చూసుకుంటానని అన్నారు నరేష్. ఇంటికి పెద్దగా మహేష్ అండ్ ఫ్యామిలీ అందరికీ నేను తోడుంటానని అంటున్నారు నరేష్.

కృష్ణ గారి తర్వాత మహేష్ ఆ క్రేజ్ ను కొనసాగిస్తున్నారు. ఆయన వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న మహేష్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక మహేష్ సినిమాల ఫలితాల గురించి అందరికీ తెలిసిందే. సినిమా టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు వస్తాయి. మహేష్ సినిమా టాక్ ఎలా ఉన్నా సినిమా మాత్రం సంచలనం సృష్టిస్తుందని గుంటూరు కారం మరోసారి ప్రూవ్ చేసింది.

Also Read : Shobha Shetty Yaswanth Reddy Engagement : హౌస్ లో అనౌన్స్ మెంట్.. ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ ఎంగేజ్మెంట్..!

  Last Updated: 23 Jan 2024, 11:12 AM IST