Site icon HashtagU Telugu

Sound Party : హీరోగా బిగ్‌బాస్ విన్నర్ VJ సన్నీ నెక్స్ట్ సినిమా ఎప్పుడో తెలుసా?

VJ Sunny Sound Party Movie Releasing Date announced

VJ Sunny Sound Party Movie Releasing Date announced

ఒకప్పుడు యాంకర్ గా పనిచేసి ఆ తర్వాత సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకున్నాడు VJ సన్నీ(VJ Sunny). ఆ తర్వాత బిగ్ బాస్(Bigg Boss) లోకి వెళ్లి సీజన్ 5లో విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక వరుసగా సినిమాలు, సిరీస్ లు చేస్తున్నాడు VJ సన్నీ. ఇప్పటికే హీరోగా సకలగుణాభిరాముడు, అన్‌స్టాపబుల్ సినిమాలు చేయగా త్వరలో మూడో సినిమా ‘సౌండ్ పార్టీ'(Sound Party)తో రాబోతున్నాడు.

ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1గా రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలుగా కొత్త దర్శకుడు సంజయ్ శేరి దర్శకత్వంలో వీజే స‌న్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌గా తెరకెక్కిన సినిమా ‘సౌండ్ పార్టీ’. జయ శంకర్ ఈ సినిమాని సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజ‌ర్, పాట‌లు విడుద‌లై టాలీవుడ్ లో గ‌ట్టిగానే సౌండ్ చేస్తున్నాయి. సినిమాపై ప్రేక్షకుల్లో అంచ‌నాలు రేకెత్తించిన ఈ చిత్రం వ‌రల్డ్ వైడ్ గా నవంబర్ 24న గ్రాండ్ గా థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతుంది.

ఈ సంద‌ర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత ర‌వి పోలిశెట్టి మాట్లాడుతూ… ఇప్ప‌టికే విడుద‌లైన మా ‘సౌండ్ పార్టీ’ సినిమా టీజ‌ర్ , సాంగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. బిజినెస్ ప‌రంగా కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. టీజ‌ర్ లోని డైలాగ్స్ , వీజే స‌న్ని , శివ‌న్నారాయ‌ణ కెమిస్ట్రీ బాగా కుదిరిందంటున్నారు. ప్రస్తుతం ఆడియ‌న్స్ ఫ‌న్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ చిత్రాల‌ను బాగా ఆద‌రిస్తున్నారు. అదే త‌ర‌హాలో తెర‌కెక్కిన మా చిత్రాన్ని కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌న్న న‌మ్మ‌కంతో ఉన్నాం. వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ నెల 24న గ్రాండ్ గా సినిమాను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్నాం అని అన్నారు.

సినిమా స‌మ‌ర్ప‌కుడు జ‌య శంక‌ర్ మాట్లాడుతూ… పాట‌లు, టీజ‌ర్ సినిమాను ఇప్ప‌టికే ప‌బ్లిక్ లోకి తీసుకెళ్లాయి. సినిమా అంతా పూర్త‌యింది. ద‌ర్శ‌కుడు సంజ‌య్ శేరికి ఏ న‌మ్మ‌కంతో అయితే సినిమా ఇచ్చామో దాన్ని నిల‌బెట్టుకున్నాడు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులకు నచ్చే విధంగా ఒక మంచి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ తీశాడు. ప్రేక్ష‌కులు మా చిత్రాన్ని కచ్చితంగా ఆదరిస్తారు అని అన్నారు.

 

ద‌ర్శ‌కుడు సంజ‌య్ శేరి మాట్లాడుతూ… నిర్మాత‌లు, జ‌య శంక‌ర్ ఇచ్చిన స‌పోర్ట్ తో సినిమాను అనుకున్న విధంగా తీయ‌గ‌లిగాను. ఇటీవ‌ల సినిమా చూసి మూవీ యూనిట్ అంతా హ్యాపీగా ఫీల‌య్యాం. మా చిత్రానికి ప‌ని చేసిన న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ ఇచ్చిన స‌పోర్ట్ వ‌ల్లే ఒక మంచి సినిమా చేయ‌గ‌లిగాను. ఇప్ప‌టికే టీజ‌ర్ కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ నెల 24న వ‌స్తోన్న సినిమాకు కూడా అదే రెస్పాన్స్ వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది అని తెలిపారు.