ఒకప్పుడు యాంకర్ గా పనిచేసి ఆ తర్వాత సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకున్నాడు VJ సన్నీ(VJ Sunny). ఆ తర్వాత బిగ్ బాస్(Bigg Boss) లోకి వెళ్లి సీజన్ 5లో విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక వరుసగా సినిమాలు, సిరీస్ లు చేస్తున్నాడు VJ సన్నీ. ఇప్పటికే హీరోగా ఓ రెండు సినిమాలు చేయగా త్వరలో మూడో సినిమా ‘సౌండ్ పార్టీ'(Sound Party)తో రాబోతున్నాడు.
ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1గా రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలుగా కొత్త దర్శకుడు సంజయ్ శేరి దర్శకత్వంలో వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా తెరకెక్కిన సినిమా ‘సౌండ్ పార్టీ’. జయ శంకర్ ఈ సినిమాని సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, పాటలు విడుదలై టాలీవుడ్ లో గట్టిగానే సౌండ్ చేస్తున్నాయి. సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు రేకెత్తించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా నవంబర్ 24న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.
తాజాగా సౌండ్ పార్టీ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ ట్రైలర్ లో హీరో సన్నీతో పాటు శివన్నారాయణ, సప్తగిరి, పృథ్వి.. ఇలా చాలా మంది కమెడియన్స్ తో ఫుల్ కామెడీ సీన్స్ చూపించారు. మరో పక్క హీరోయిన్ హ్రితిక అందాలని కూడా చూపించారు. మొదటి నుంచి చిత్రయూనిట్ చెప్తున్నట్టు సౌండ్ పార్టీ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది.
Also Read : Naga Chaitanya Youtube Channel : సొంతగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అక్కినేని హీరో