Site icon HashtagU Telugu

The Kerala Story: పొలిటికల్ టర్న్ తీసుకుంటున్న ‘ది కేరళ స్టోరీ’

The Kerala Story

New Web Story Copy (68)

The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ వివాదంపై శశి థరూర్ ట్వీట్‌పై దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కౌంటర్ ఇచ్చారు. ది కేరళ స్టోరీ విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా సినిమాపై దుమారం రేగింది. విషయం కోర్టు వరకు వెళ్ళింది. ఇప్పుడు ది కేరళ స్టోరీకి సంబంధించి కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ మరియు వివేక్ అగ్నిహోత్రి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది.

‘ది కేరళ స్టోరీ’ ట్రైలర్‌లో 32 వేల మంది అమ్మాయిలను ఇస్లామైజేషన్ చేసి, ఆపై వారిని ఉగ్రవాద సంస్థల్లో భాగం చేసిన విధంగా ట్రైలర్ లో చూపించారు. ఇప్పుడు సినిమా విడుదలకు మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా విడుదలను నిలిపివేయాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. అదే సమయంలో శశి థరూర్ సినిమాపై ట్వీట్ చేయడం హాట్ టాపిక్ అయింది.

‘ది కేరళ స్టోరీ’ కథనాన్ని సవాలు చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. కేరళలోని 32000 మంది మహిళలను ఇస్లామీకరణ చేసి సిరియాకు పంపినట్లు ఎవరైనా రుజువు చేస్తే కోటి రూపాయలు ఇస్తామని కేరళకు చెందిన ముస్లిం యూత్ లీగ్ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌ను రీట్వీట్ చేస్తూ శశి థరూర్ “కేరళలోని 32 వేల మంది మహిళలను ఇస్లామీకరణను సమర్థిస్తున్న వారందరికీ ఇది మంచి అవకాశం నిరూపించి, డబ్బు సంపాదించండి. ఎవరైనా సవాలును స్వీకరిస్తారా అంటూ ట్వీట్ చేశాడు.

శశి థరూర్ పోస్ట్ పై ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి వెంటనే స్పందించారు. శశి థరూర్ పోస్ట్‌పై వివేక్ అగ్నిహోత్రి స్పందిస్తూ “మీరు సినిమాని చూడకుండా సినిమాపై దాడి చేస్తే అది మీ నిజాయితీని ఎత్తి చూపుతుంది అంటూ కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ వివాదం కాస్త పొలిటికల్ టర్న్ తీసుకున్నట్టు అవుతుంది. మరోవైపు సుప్రీం కోర్టు ఈ వివాదాన్ని పట్టించుకోవడం లేదు. ది కేరళ స్టోరీ పై విచారణకు సుప్రీం నిరాకరించింది.

Read More: DK Sivakumar: డీకే కు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్!