Viswak Sen : విశ్వక్ సేన్ లైలా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవిని పిలుస్తున్నారు ఎందుకు మీరు నందమూరి అభిమాని కదా అనే ప్రశ్న ఎదురైంది. మీరు ఆ కాంపౌండ్ కి సంబందించిన మనిషి కదా అని అడిగితే.. నాకు మా ఇంటి కాంపౌండ్ మాత్రమే తెలుసు ఇవన్నీ మీరు పెట్టిన కాంపౌండ్ లు అన్నాడు విశ్వక్ సేన్.
అంతేకదు బాస్ ఈజ్ బాస్.. మా నాన్నకు చిరంజీవి గారికి పొలిటికల్ రిలేషన్ షిప్ ఉంది. ఆయన ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. ఇక్కడ నా ఒక్కడి ఇంట్రెస్ట్ మాత్రమే కాదు ప్రొడ్యూసర్ నుంచి మిగతా వారికి ఇష్టమైన వారు ఉంటారు. అయినా ఎవరికి ఎలాంటి ఇంటెన్షన్స్ ఉండవు. సినిమాను సపోర్ట్ చేయాలనే ఆలోచనతోనే ఎవరైనా ఉంటారని అన్నాడు విశ్వక్ సేన్.
విశ్వక్ సేన్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తను ఎన్టీఆర్ అభిమానిని అని ఎప్పుడూ చెప్పుకునే విశ్వక్ మెగాస్టార్ చిరంజీవి గురించి బాస్ ఈజ్ బాస్ అనడం.. ఇంకా కాంపౌండ్ లు ఏమి లేవని చెప్పడం ప్రత్యేకంగా అనిపించింది. ఇప్పటికే ఫ్యాన్స్ మధ్య ఉన్న దాన్ని పెద్దది చేయొద్దు అని సైలెంట్ గా విశ్వక్ సేన్ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. రామ్ నారాయణ డైరెక్షన్ లో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన లైలా సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను షైన్ స్క్రీ బ్యానర్ లో సాహు గారపాటి నిర్మించారు.