Site icon HashtagU Telugu

Viswak Sen Gangs of Godhavari : విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ ఎప్పుడు..?

Is Hero Changed for Krishna Chaitanya Gangs Of Godhavari

Is Hero Changed for Krishna Chaitanya Gangs Of Godhavari

Viswak Sen Gangs of Godhavari మాస్ కా దాస్ విశ్వక్ సేక్ రీసెంట్ గా గామి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. విశ్వధర్ డైరెక్ట్ చేసిన గామి సినిమా ఒక ప్రయోగాత్మకంగా తెరకెక్కించారు. డిఫరెంట్ కథ కథనంతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

ఈ సినిమా సక్సెస్ తో సంతోషంగా ఉన్న విశ్వక్ సేన్ సినిమా మరింత మంది ప్రేక్షకులకు చేరువయ్యేలా ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా తన నెక్స్ట్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విషయాలను కూడా పంచుకున్నాడు విశ్వక్ సేన్.

కృష్ణ చైతన్య డైరెక్షన్ లో తెరకెక్కిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మాస్ అండ్ కమర్షియల్ అంశాలతో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తో వస్తుందని అన్నారు. ఆ సినిమా అవుట్ పుట్ బాగా వచ్చిందని. సినిమా రిలీజ్ కోసం తాను కూడా ఎదురుచూస్తున్నానని అన్నారు. సినిమా మే లో రిలీజ్ అవుతుందని చెప్పారు విశ్వక్ సేన్. అసలైతే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా లాస్ట్ ఇయర్ డిసెంబర్ లోనే రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ కుదరలేదు.

సితార బ్యానర్ లో తెరకెక్కిన ఆ సినిమా మంచి రిలీజ్ డేట్ కోసం చూస్తున్నారు. మే 9న ఎలాగు కల్కి సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. సో మే సెకండ్ వీక్ తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ ఉండే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు.

Also Read : Vikram Thangalan : చియాన్ ఫ్యాన్స్ కి మళ్లీ నిరాశే.. తంగలాన్ రిలీజ్ పై డైరెక్టర్ ఏమన్నాడు అంటే..!