Site icon HashtagU Telugu

Viswak Sen Gangs of Godhavari : మాస్ సాంగ్ తో గోదావరి గ్యాంగ్..!

Viswak Sen Gangs Of Godhavari Bad Song Released

Viswak Sen Gangs Of Godhavari Bad Song Released

Viswak Sen Gangs of Godhavari మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతనయ డైర్క్షన్ లో వస్తున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. చాలా కాలం తర్వాత యువన్ శంకర్ రాజా తెలుగు సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన సాంగ్ మంచి ప్రేక్షకాదరణ అందుకోగా లేటెస్ట్ గా సినిమా నుంచి బ్యాడ్ సాంగ్ ఒకటి రిలీజైంది.

పీరియాడికల్ స్టోరీతో వస్తున్న ఈ సినిమా ప్రచార చిత్రాలు అంచనాలు పెంచగా లేటెస్ట్ గా సినిమా నుంచి మరో సాంగ్ బ్యాడ్ సాంగ్ రిలీజైంది. ఈ సాంగ్ తో మరోసారి తన మాస్ స్టామినా చూపించాడు యువన్ శంకర్ రాజా.

సినిమా బ్యాక్ డ్రాప్ కు తగినట్టుగా ఈ మాస్ సాంగ్ ఉంది. సినిమాలో విశ్వక్ సేన్ కి జతగా నేహా శెట్టి నటించింది. ఈ సినిమాను మే 17న రిలీజ్ చేయాల్సి ఉన్నా ప్రస్తుతం ఏపీలో ఎలక్షన్స్ హడావిడి ఉన్న కారణంగా మే 31న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. రీసెంట్ గా గామి తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో మాస్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.