Site icon HashtagU Telugu

Viswak Sen Gami First Look : అతని అతిపెద్ద భయం మానవ స్పర్శ.. గామి ఫస్ట్ లుక్.. విశ్వక్ సేన్ షాకింగ్ లుక్..!

Viswak Sen Gami First Look Shocked

Viswak Sen Gami First Look Shocked

Viswak Sen Gami First Look మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ గామి సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమా టైటిల్ చాలా రోజులుగా డిస్కషన్స్ లో ఉండగా సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఫైనల్ గా ఇన్నాళ్లకు ఈ సినిమా నుంచి పోస్టర్ వదిలారు. గామి సినిమా నుంచి విశ్వక్ సేన్ లుక్ రిలీజ్ చేశారు. సినిమాలో విశ్వక్ సేన్ ఘోర పాత్రలో కనిపించనున్నారు.

We’re now on WhatsApp : Click to Join

విద్యాధర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు. ఓ పక్క మాస్ కా దాస్ గ్యాన్స్ ఆఫ్ గోదావరి సినిమా చేస్తున్నాడు. కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సితార బ్యానర్ నిర్మిస్తుంది.

ఇక గామి విషయానికి వస్తే ఫస్ట్ లుక్ పోస్టరే డిఫరెంట్ గా ఉంది. తప్పకుండా విశ్వక్ సేన్ క్రేజ్ ఈ సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. గామి పోస్టర్ తో పాటుగా అతని అతిపెద్ద భయం మానవ స్పర్శ.. అతని లోతైన కోరిక కూడా మాన స్పర్శే అని రాసుకొచ్చారు. మరి ఈ మానవ స్పర్శ కోసం అఘోర ఏం చేసింది అన్నది గామి కథ. సినిమాలో మిగతా నటీనటులు ఎవరన్నది తెలియాల్సి ఉంది.

Also Read : Shobhitha Dhulipala : బాబోయ్ శోభితా సోషల్ మీడియాని హీటెక్కించేసింది.. తెలుగు అమ్మాయి టాప్ లేపే అందాలు..!