Site icon HashtagU Telugu

Viswak Sen Deactivate his Instagram Account Fans Shock : విశ్వక్ సేన్ గుడ్ బై చెప్పేశాడు.. ఫ్యాన్స్ కి ఇలా షాక్ ఇచ్చాడేంటి..?

Viswak Sen Comments on Vijay Setupathi Maharaja Movie

Viswak Sen Comments on Vijay Setupathi Maharaja Movie

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Viswak Sen) తన సోషల్ మీడియా అకౌంట్ ని డిలీట్ చేశాడు. తన దూకుడుతనంతో ప్రేక్షకులను ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసిన విశ్వక్ సేన్ అనతికాలంలోనే మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో మాస్ కా దాస్ (Mass Ka Dass) అనే స్క్రీన్ నేమ్ ని కూడా సంపాదించాడు. ఐతే తన సినిమా ప్రమోషన్స్ తో కాస్త నెగిటివిటీ మూటకట్టుకుంటున్న విశ్వక్ సేన్ తనని ఎవరి ఏదైనా అంటే మాత్రం డబుల్ డోస్ ఇచ్చేస్తాడు. ఐతే అవి ఒక్కోసారి విశ్వక్ సేన్ గ్రాఫ్ పడిపోయేలా చేస్తున్నాయి.

విశ్వక్ సేన్ లేటెస్ట్ గా ఒక సినిమా రివ్యూయర్స్ మీద కూడా కామెంట్ చేశాడు. కారణాలు ఏంటో తెలియదు కానీ విశ్వక్ సేన్ తన ఇన్ స్టాగ్రాం ఖాతాని డిలీట్ చేశాడు. విశ్వక్ ఎకౌంట్ డిలీట్ చేయడంతో అతనికి ఏమైందంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. ఐతే తన ట్విట్టర్ ఖాతాలో ఆ విషయన్ని చెబుతూ కొన్నాళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని అనుకుంటున్నా పూర్తిగా సినిమాల మీద దృష్టి పెట్టాలని అనుకుంటున్నా అంటూ రాసుకొచ్చాడు.

ట్విట్టర్ హ్యాండిల్ మాత్రం తన టీం రన్ చేస్తుందని చెప్పాడు. మళ్లీ సినిమా ప్రమోషన్స్ కోసం సోషల్ మీడియాలోకి వస్తా అని అన్నాడు విశ్వక్ సేన్. మరి విశ్వక్ సేన్ ఇన్ స్టాగ్రాం (Instagram) కి గుడ్ బై చెప్పడం పట్ల ఆడియన్స్ అంతా షాక్ అవుతున్నారు. ఇదిలాఉంటే విశ్వక్ సేన్ ప్రస్తుతం లైలా (Laila) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా మెకానిక్ రాకీ (Mechanic Rocky) తో కూడా వస్తున్నాడు.