Site icon HashtagU Telugu

Viswak Sen : విజయ్ సేతుపతి మహారాజపై విశ్వక్ సేన్ కామెంట్..!

Viswak Sen Comments on Vijay Setupathi Maharaja Movie

Viswak Sen Comments on Vijay Setupathi Maharaja Movie

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Viswak Sen ) హీరోగా ఈ శుక్రవారం మెకానిక్ రాకీ సినిమా వస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో విశ్వక్ సేన్ సినిమాలో చాలా డెప్త్ ఉంటుంది ఐతే దాన్ని ట్రైలర్ లో చాలా తక్కువ చూపించామని అన్నారు. దానికి ఉదహరణగా విజయ్ సేతుపతి (Vijay Sethupathi) మహారాజ సినిమాట్రైలర్ చూసిన వాళ్లు సినిమా చూస్తే కానీ సినిమాలో అంత మ్యాటర్ ఉందా అన్నది అర్ధం కాలేదు.

అలానే మెకానిక్ రాకీ (Mechanic Rockey) సినిమాలో డెప్త్ చాలా ఉంటుంది. ట్రైలర్ లో అన్నిటినీ చూపించలేం కాబట్టి పెట్టలేదని అన్నారు విశ్వక్ సేన్. ఇక తన ప్రతి సినిమా ప్రమోషన్స్ లో సంచలన కామెంట్స్ తో మీడియా లో హాట్ టాపిక్ గా మారే విశ్వక్ సేన్. ఇక మీదట అలా చేయనని అన్నారు. మీడియాతో స్పెషల్ చిట్ చాట్ ప్రోగ్రాం ఏర్పరచిన విశ్వక్ సేన్ అందుకు కానుకగా కొంతమందికి గోల్డ్ కాయిన్స్ ఇచ్చాడు.

విశ్వక్ సేన్ ఇచ్చిన ఈ గోల్డ్ కాయిన్ గిఫ్ట్స్ కు మీడియా వాళ్లు ఖుషి అవుతున్నారు. విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ ట్రైలర్ రెగ్యులర్ మాస్ సినిమాలానే కొడుతుంది. ఐతే ఈ సినిమాలో చాల డెప్త్ ఉందని దాన్ని ట్రైలర్ లో చూపించలేదని అంటున్నాడు విశ్వక్ సేన్. మీనాక్షి చౌదరి, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటించిన మెకానిక్ రాకీ సినిమాను రవితేజ ముళ్లపూడి డైరెక్ట్ చేశారు. ఈ సినిమాను ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రాం తాళ్లూరి నిర్మించారు.

Also Read : Ram : మహేష్ తో రామ్.. మైత్రి మెగా ప్లాన్..!