Site icon HashtagU Telugu

Viswak Sen : నాగ చైతన్య సినిమా ఆడిషన్ కు విశ్వక్.. కానీ జరిగిందేంటంటే..!

Krishna Chaitanya Power Peta hero Changed

Krishna Chaitanya Power Peta hero Changed

Viswak Sen యువ హీరోల్లో సూపర్ జోష్ తో కెరీర్ కొనసాగిస్తున్న విశ్వక్ సేన్ కేవలం హీరోగానే కాదు డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇలా తనలోని అన్నీ టాలెంట్ లని చూపించేస్తున్నాడు. విశ్వక్ సేన్ నటించిన గామి సినిమా మార్చి 8న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు యువ హీరో.

నాగ చైతన్య మొదటి సినిమా జోష్ సినిమాలో కొత్త వారిని తీసుకుంటున్నారని తెలిసి ఆ సినిమా ఆడిషన్ కు వెళ్లారట విశ్వక్ సేన్. తనని అందరు హీరోలా ఉన్నావ్ సినిమాల్లో ట్రై చెయ్ అంటే ఆ సినిమా కోసం దిల్ రాజు కొత్త వారికి అవకాశం ఇస్తున్నారని తెలిసి ఆడిషన్ కి వెళ్లానని అయితే ఆ సినిమాకు సెలెక్ట్ కాలేదని అన్నారు విశ్వక్ సేన్.

అయితే ఆ టైం లో తనకు హీరో అవ్వాలన్న కోరిక బలంగా ఏర్పడిందని అన్నారు. ఆ తర్వాత చాలా ఆఫీస్ ల చుట్టూ తాను తిరిగానని చెప్పారు. అయితే ఇది చెప్పి సింపతీ తెచ్చుకోవాలని నేను అనుకోవడం లేదని అన్నారు. విశ్వక్ సేన్ గామి సినిమా తర్వాత గ్యాన్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమాను మంచి డేట్ చూసి రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్.

Also Read : Ram Puri Jagannath : డబుల్ ఇస్మార్ట్.. ఈ డేట్ కు ఫిక్స్ అయారా..?