Viswak Sen : మాస్ కా దాస్ దేనికైనా సిద్ధమే..!

Viswak Sen యువ హీరో అనతికాలంలోనే యూత్ లో సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకున్న విశ్వక్ సేన్ సినిమా కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకునేందుకు రెడీ అనేస్తున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Viswak Sen Comments on Vijay Setupathi Maharaja Movie

Viswak Sen Comments on Vijay Setupathi Maharaja Movie

Viswak Sen యువ హీరో అనతికాలంలోనే యూత్ లో సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకున్న విశ్వక్ సేన్ సినిమా కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకునేందుకు రెడీ అనేస్తున్నాడు. ఆడియన్స్ ని అలరించాలనే దాహం అది ఇది అని కాదు ఎలాంటి సినిమా అయినా చేస్తా చేసి తీరుతా అన్నట్టుగా విశ్వక్ సేన్ అటెంప్ట్ ఉంది. ఈ ఇయర్ ఆల్రెడీ గామి తో డిఫరెంట్ అటెంప్ట్ చేసిన విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో కూడా అదరగొట్టాడు.

ఇక త్వరలో రెండు క్రేజీ సినిమాలతో రాబోతున్నాడు విశ్వక్ సేన్. అందులో లైలా అనే సినిమా ఐతే విశ్వక్ సేన్ కొత్త ప్రయోగం చేస్తున్నాడు. ఈ సినిమాను రాం నాయాణ డైరెక్ట్ చేస్తుండగా సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కనిపిస్తున్నాడు. సినిమా రీసెంట్ గా పూజా కార్యక్రమాలు జరుపుకోగా లైలా పోస్టర్ వదలగా అందులో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కేవలం కళ్లు ఒక్కటే చూపించారు.

దాదాపు ఆ కళ్లు చూసే ఆడియన్స్ అంతా కూడా ఫ్లాట్ అయిపోయారని చెప్పొచ్చు. మాస్ కా దాస్ తనకున్న ఈ మాస్ ఇమేజ్ తో అలాంటి సినిమాలే చేయొచ్చు కానీ డిఫరెంట్ సినిమాలు చేసి సినీ ప్రియులను అలరించాలని చూస్తున్నాడు. విశ్వక్ సేన్ చేస్తున్న ఈ సినిమాల వల్ల మిగతా హీరోలకు కూడా టఫ్ ఫైట్ అందిస్తున్నాడు. మరి విశ్వక్ లేడీ గెటప్ తో వస్తున్న ఈ లైలా కథ ఏంటన్నది సినిమా వస్తేనే కానీ చెప్పగలం.

  Last Updated: 04 Jul 2024, 11:19 PM IST