Chiranjeevi : రష్యన్ డెలిగేట్స్‌తో చిరంజీవి ప్రత్యేక సమావేశం..

రష్యన్ డెలిగేట్స్‌తో చిరంజీవి ప్రత్యేక సమావేశం. సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండనంటూనే..

  • Written By:
  • Publish Date - April 19, 2024 / 11:40 AM IST

Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రస్తుతం చిరంజీవే పెద్ద దిక్కు అంటూ పలువురు బడా ప్రముఖులు తమ అభిప్రాయాన్ని ఓపెన్ జీ తెలియజేస్తూ ఉంటారు. కానీ చిరంజీవి మాత్రం ఆ పెద్దరికం తనకి వద్దంటూ, కళామతల్లి ముద్దుబిడ్డగా తాను చేయాల్సిన కర్తవ్యం చేసుకుంటూ వెళ్తానని, అందుకు తనకి పెద్దరికం అవసరం లేదంటూ చెప్పుకొస్తారు. ఇక మాటల్లో చెప్పినట్లే చేతల్లో చేసుకుంటూ చిరంజీవి ముందుకు సాగుతున్నారు.

ఈక్రమంలోనే ప్రస్తుతం గ్లోబల్ స్థాయికి ఎదుగుతున్న తెలుగు సినిమాకి ఉపయోగపడేలా.. పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూ వస్తున్నారు. ఆ మధ్య ఇంగ్లాండ్ డెలిగేట్స్‌తో సమావేశం అయ్యి.. బ్రిటన్ లో తెలుగు సినిమా షూటింగ్స్ సహకారం కోసం చర్చలు జరిపారు. తాజాగా రష్యన్ డెలిగేట్స్‌తో చిరంజీవి ప్రత్యేక సమావేశం అయ్యారు. రష్యాకి చెందిన కల్చరల్ మినిస్టరీ.. నిన్న ఏప్రిల్ 18న చిరంజీవి ఇంటిలో సమావేశం అయ్యారు.

అక్కడ చిరంజీవితో కలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి, అలాగే రష్యా ఫిలిం ఇండస్ట్రీతో సంబంధాలు గురించి చర్చించారు. రష్యాలో తెలుగు సినిమా షూటింగ్స్ ని ప్రమోట్ చేసేలా చర్చలు జరిపినట్లు సమాచారం. ఇక సమావేశానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్నారు. వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం.. సోషియో ఫాంటసీ నేపథ్యంతో తెరకెక్కుతుంది. గతం చిరంజీవి చేసిన ‘అంజి’ సినిమా తరహాలో ఈ చిత్రం ఉండబోతుంది. త్రిష ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని.. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. జులై నెలాఖరుకు ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యిపోతుందట. ఇక మిగిలిన ఐదు నెలలు గ్రాఫిక్స్ వర్క్స్ కి కేటాయిస్తున్నారట. సినిమాలో 70 శాతం కథ విఎఫెక్స్ పై నడుస్తుందట.

Also read : Game Changer : బాలీవుడ్‌లో రికార్డు సృష్టించిన స్టాండ్ ఎలోన్ సినిమాలు ఇవే.. RRR తరువాత గేమ్ ఛేంజర్..