Site icon HashtagU Telugu

Vishwambhara : ‘విశ్వంభర’లో హైలైట్ సీన్ ఇదేనట..!!

Vishwambhara Highlight Scen

Vishwambhara Highlight Scen

చిరంజీవి (Chiranjeevi) హీరోగా మల్లిడి వశిష్ఠ (Mallidi Vassishta) కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిరు 156 మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara). సోషియో ఫాంటసీ మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్​లో శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా చిరుతో ఓ సాంగ్​ను చిత్రీకరించనున్నారట. ఓ భారీ సెట్​లో 600 మంది డ్యాన్సర్లతో చిరు స్టెప్పులు వెయ్యనున్నట్లు టాక్. శోభా మాస్టర్ ఆ పాటకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

Delhi CM Race: ఢిల్లీ సీఎంగా యోగి లాంటి లీడర్.. ఎందుకు ?

ఇదిలా ఉండగా ఈ మూవీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్​గా నిలుస్తుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ సీక్వెన్స్​ను సుమారు 26 రోజుల పాటు షూట్​ చేశారట. ఇక 54 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని కూడా మూవీ టీమ్ ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం ముందే సీక్వెన్స్ షూటింగ్ జరిగింది. గతంలో దీనికి సంబంధించిన ఫొటోలు సైతం వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. మరి ఈ సీక్వెన్స్ వెండితెరపై ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఈ మూవీ లో త్రిష, అషికా రంగనాథ్‌, మృణాల్ ఠాకూర్, కునాల్‌ కపూర్‌, జాన్వీ కపూర్ కీలక పాత్రలు పోషించనున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్​పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీ తర్వాత చిరంజీవి ‘దసరా’ ఫేమ్‌ శ్రీకాంత్‌ ఓదెలతో ఓ చిత్రం , అనిల్‌ రావిపూడి డైరెక్షన్లో మరో సినిమా చేయనున్నాడు.